Begin typing your search above and press return to search.
నితిన్ మీద కేసు కొట్టేశారు
By: Tupaki Desk | 9 Jan 2018 5:52 AM GMTగత కొంత కాలంగా నితిన్ పై ఒక కేసు నడుస్తోన్న విషయం అందరికి తెలిసిందే. 2015 రిలీజ్ అయినా అఖిల్ మూవీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో నితిన్ పై అలాగే అతని సోదరి నిఖితారెడ్డ్డిలపై మల్కాజిగిరి కోర్టులో సికింద్రాబాద్ కు చెందిన జి.సత్యనారాయణ అనే వ్యక్తి పిర్యాదు చేశాడు. కేసులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ను నిందితులుగా పేర్కొన్నారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.
అయితే ఫైనల్ గా కోర్టు కేసును కొట్టి వేసింది. అఖిల్ సినిమాకు సంబందించిన హక్కులను తనకు ఇస్తానని శ్రేష్ట్ మూవీస్ చెప్పిందని అందుకు అడ్వాన్స్ గా రూ.50 లక్షలు కూడా ఇచ్చానని పిటిషన్ లో సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే కోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి కొట్టి వేసింది. ఇది చెక్కులకు సంబందించిన వ్యవహారం.. కానీ క్రిమినల్ కేసు పెట్టారు.. ఇలా కేసు పెట్టడం సరికాదని తెలుపుతూ కేసును కొట్టేశారు. అంతే కాకుండా.. అసలు నితిన్ అండ్ నిఖిత ఈ శ్రేష్ఠ్ సంస్థలో పార్టనర్లు కాదు కాబట్టి.. ఈ కేసు చెల్లదని కోర్టు పేర్కొంది.
అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ 2015 నవంబర్ 11న రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. నితిన్ హోమ్ బ్యానర్ లో వివి.వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా భారి డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు ఏ తరహాలోను నష్టాలను రికవర్ చేయలేకపోయింది. అయితే వినాయక్ అప్పట్లో కొంత మంది పంపిణీదారులను ఆదుకున్నారు. ఒక నితిన్ తండ్రి కూడా కొందరికి డబ్బులు తిరిగిచ్చి మ్యాటర్ సెటిల్ చేశారని టాక్.