Begin typing your search above and press return to search.
సుశాంత్ సూసైడ్ : కరణ్ , సల్మాన్ లపై కేసు కొట్టేసిన కోర్టు !
By: Tupaki Desk | 9 July 2020 11:30 PM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త యావత్ దేశాన్ని కదిలించింది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న సుశాంత్ ఆలా మధ్యలోనే తనువు చలించడం పట్ల ప్రతి ఒక్కరు కన్నీరుపెట్టుకున్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దల పై వరుస కథనాలు ప్రచారం అయ్యాయి. నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ సినిమా ప్రపంచం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది.
ఈ క్రమంలోనే సుధీర్ కుమార్ ఓజా అనే అడ్వకేట్ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలీలపై కేసు నమోదు చేయాలని బిహార్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ను బుధవారం బీహార్ కోర్టు కొట్టివేసింది. ఈ విషయం కోర్టు పరిధికి వెలుపల ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ 3 రోజుల తర్వాత సుధీర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో సాక్షులుగా సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని తీవ్ర విమర్శలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరును పొందుపరిచారు.
ఇక , తాజాగా కోర్టు తన పిటిషన్ ను కొట్టివేయడంపై సుధీర్ స్పందిస్తూ.. ఈ తీర్పును జిల్లా కోర్టులో సవాలు చేయనున్నట్టు తెలిపారు. సుశాంత్ మరణ వార్తతో బిహార్ వాసులు బాధలో ఉన్నారని, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారికి శిక్షపడేందుకు పోరాడాల్సి ఉందని చెప్పారు. దానికోసం నేను కృషి చేస్తా అని స్పష్టం చేశారు