Begin typing your search above and press return to search.

కెజీఎఫ్ మేకర్స్ కు కోర్టు నోటీసు!

By:  Tupaki Desk   |   2 Oct 2019 7:12 AM GMT
కెజీఎఫ్ మేకర్స్ కు కోర్టు నోటీసు!
X
కన్నడ చిత్రం 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 1' దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకర్షించింది. సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా యష్ కు అన్ని భాషల్లోనూ గుర్తింపు తీసుకొచ్చింది. కన్నడ చిత్ర సీమ స్థాయిని కూడా ఈ సినిమా ఒక్కసారిగా పెంచింది. ప్రస్తుతం 'కె.జీ.ఎఫ్: చాప్టర్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి భాగం కంటే భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కు మొదటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. కొద్దోరోజుల క్రితం సయనైడ్ హిల్స్ లో చిత్రీకరణ జరిపేందుకు 'కె.జీ.ఎఫ్' టీమ్ రెడీ అయ్యారు కానీ అక్కడి వారు ఒప్పుకోలేదు. 'కే.జీ.ఎఫ్' వారు వేస్తున్న సెట్ల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని కేసు వేయడంతో చిత్రీకరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫైనల్ గా హై కోర్టువారు 'కె.జీ.ఎఫ్' టీమ్ షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతినిచ్చారు. అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో 'కె.జీ.ఎఫ్' టీమ్ కు మరో ఇబ్బంది వచ్చి పడింది. 'కె.జీ.ఎఫ్' లో రౌడీ తంగం అనే వ్యక్తి పాత్ర ఉంది. ఇతను 80.. 90 లలో కరుడుగట్టిన క్రిమినల్. పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండేవాడు. ఫైనల్ గా ఇతన్ని 1997 లో ఎన్కౌంటర్ చేసి చంపారు. ఈ తంగం కుటుంబ సభ్యులు తాజాగా కోర్టులో 'కె.జీ.ఎఫ్' మేకర్స్ పై కోర్టులు కేసు వేశారు.

తంగం పాత్రను నెగెటివ్ గా చూపిస్తున్నారని తంగం కుటుంబ సభ్యులు మొదటి పార్ట్ రిలీజ్ అయ్యే సమయంలో కూడా గొడవ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మరింత నెగెటివ్ గా చూపిస్తారనే అనుమానంతో కోర్టును ఆశ్రయించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్.. 'కె.జీ.ఎఫ్' నిర్మాత.. కర్ణాటక ఫిలిం ఛాంబర్ వారిని ఈ కేసులో ప్రతివాదులగా పేర్కొనడంతో వీరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ కేసును 'కె.జీ.ఎఫ్' టీమ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.