Begin typing your search above and press return to search.
ఆ నష్టంను హీరో చెల్లించాల్సిందేనన్న కోర్టు
By: Tupaki Desk | 9 Oct 2020 5:30 PM GMTవిశాల్ హీరోగా తమన్నా హీరోయిన్ గా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యాక్షన్' సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. రూ. 44 కోట్ల రూపాయలతో రూపొందిన ఆ సినిమాకు మినిమం 20 కోట్ల వసూళ్లను హీరో విశాల్ గ్యారెంటీ ఇచ్చాడు. 20 కోట్ల వసూళ్లు రాకుంటే తాను ఎంత తక్కువ వస్తే అంత మొత్తంను ఇస్తానంటూ నిర్మాణ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. సినిమా తెలుగు మరియు తమిళంలో కలిపి కేవలం 11.7 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది. నిర్మాణ సంస్థ భారీగా నష్టపోయింది. దాంతో అగ్రిమెంట్ ప్రకారం 20 కోట్ల లోపు వసూళ్లు నమోదు అయిన కారణంగా విశాల్ 8.3 కోట్లను చెల్లించాల్సిందిగా నిర్మాణ సంస్థ డిమాండ్ చేసింది. విశాల్ అందుకు ఒప్పుకోక పోవడంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే.
గత కొన్ని వారాలుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో తుది తీర్పును మద్రాసు హైకోర్టు వెళ్లడించింది. అగ్రిమెంట్ ప్రకారం నిర్మాణ సంస్థకు విశాల్ 8.3 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందే అంటూ తీర్పులో పేర్కొనడం జరిగింది. నష్టం పూడ్చేందుకు చక్ర సినిమాను వారి నిర్మాణ సంస్థలో చేసేందుకు ఒప్పుకుని మళ్లీ సొంతంగానే ఆ సినిమాను నిర్మించాడు విశాల్. ఇప్పటికే ఒకసారి నిర్మాణ సంస్థకు హ్యాండ్ ఇచ్చిన విశాల్ ఈసారి కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. మద్రాసు హైకోర్టు తీర్పును గౌరవిస్తాడా లేదంటే పై కోర్టుకు విశాల్ వెళ్తాడా అనేది చూడాలి. ఈ డబ్బు కట్టకుండా మళ్లీ నిర్మాణ సంస్థతో విశాల్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందేమో అంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.