Begin typing your search above and press return to search.
కోర్టు దెబ్బకి.. ఉడ్తా పంజాబ్ వచ్చేస్తోంది!!
By: Tupaki Desk | 10 Jun 2016 5:14 PM GMTఉడ్తా పంజాబ్ వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. అక్కడ ఈ కేసును విచారించిన జడ్జ్ పేరు చంద్రశేఖర్ శంకర్ 'ధర్మాధికారి'. కేసు సంగతి చెప్పకుండా జడ్జ్ పేరెందుకు అంటారా.. గుర్తు పెట్టుకోండి! మనం ఈ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఉడ్తాపంజాబ్ పై సీబీఎఫ్సీ, మూవీ మేకర్స్ మధ్య బాగా రసవత్తరంగంగా సాగాయి. ఆల్మోస్ట్ సెన్సార్ బోర్డ్ కి జడ్జ్ చెమటలు పట్టించేశారని చెప్పచ్చు.
ఉడ్తా పంజాబ్ లో పాత్రధారులు హిందీతో పాటు పంజాబీ కూడా మాట్లాడారని బోర్డ్ చెబితే.. మీరు పంజాబీ అర్ధం చేసుకోలేకపోయినా కట్స్ సూచించారా అని అడిగారు జడ్జ్. కంజర్ అనే పదాన్ని వర్ణించడానికి ఇబ్బందిగా ఉందంటే.. 'ప్రస్తుతం ప్రేక్షకులు ఓపెన్గానే చాలా మాట్లాడుకుంటున్నారు కదా. 1980ల తర్వాత ఆడియన్స్ చాలా మెచ్యూర్ అయ్యారు. దీనిపై మీరెందుకు అంతగా బాధపడతారు' అన్నారు న్యాయమూర్తి. 'మల్టీప్లెక్స్ ఆడియన్స్ అర్ధం చేసుకోగలరు. ఏ పదం ఉపయోగించడం కరెక్టో కాదో మీరెలా చెప్పగలరు?'... 'సినిమా రంగం ఏమన్నా గాజుతో తయారు చేశారా? హ్యాండిల్ విత్ కేర్ అని బాధ్యతలు మీకప్పగించారా? మీరు ఎందుకు ఎవరికోసం కట్స్ అడుగుతున్నారో ఆడియన్స్ కు తెలుసు' అంటూ నిలదీసేశారు జడ్జి.
'ఈ సినిమా డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోందా' అని న్యాయాధికారి అడిగితే ఔనని సమాధానం ఇచ్చింది సెన్సార్ బోర్డ్. 'అలాంటప్పుడు సినిమాని ఎందుకు బ్యాన్ చేయలేద'ని ప్రశ్నించారు ధర్మాధికారి. 'CBFC ఉన్నది సర్టిఫై చేయడానికి మాత్రమే. సెన్సార్ చేయడానికి కాదు. నిజమైన సెన్సార్ పబ్లిక్ మాత్రమే. సీబీఎఫ్సీ చేయాల్సిన అవసరం లేదు' అంటూ తేల్చేశారు జడ్జ్.
'క్రియేటర్స్ అయిన మూవీ మేకర్స్ ఇండస్ట్రీ బతికేందుకు కావాలి. మీరు కూడా వాస్తవం తెలుసుకోవాలి'... 'సినిమా నిండా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే జనాలు సినిమా చూడ్డం మానేస్తారు కదా'... అన్న జడ్జి.. కేవలం ఒకే ఒక్క కట్ ను సూచించారు. షాహిద్ కపూర్ యూరిన్ కు వెళ్తున్న సీన్ ను తీసేసేందుకు మేకర్స్ కూడా అంగీకరించడంతో.. సినిమా రిలీజ్ కు అంగీకరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. అయితే.. ఇవన్నీ కోర్టులో జరిగిన వాదోపవాదాలు మాత్రమే. తుది తీర్పును ఈ నెల 13న ప్రకటించనుంది కోర్టు.
ఇంతకీ ముందు మనం జడ్జ్ పేరు ధర్మాధికారి అని వచ్చినపుడు.. ఆ విషయం తర్వాత చెప్పుకోవాలని అనుకున్నాం కదా.. తాము గీసిందే గీత అని 89కట్స్ విధించిన సెన్సార్ బోర్డుకు ఇంతకంటే ఘోర అవమానం ఉంటుంది. ఆ జడ్జ్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా బోర్డ్ దగ్గర సమాధానం ఉందా... నిజంగానే ఆయన ధర్మాధికారే కదా.. ఆయనకు సరైన పేరు అనిపించడం లేదూ!