Begin typing your search above and press return to search.

ఏంటట ఆ సినిమా గొప్పదనం?

By:  Tupaki Desk   |   24 Sep 2015 7:30 AM GMT
ఏంటట ఆ సినిమా గొప్పదనం?
X
నిన్నట్నుంచి కోర్ట్.. కోర్ట్.. అని ఒకటే గోల. బాహుబలి ఔట్.. ‘కోర్ట్’ సినిమాకే ఆస్కార్ ఛాన్స్ అంటూ సోషల్ మీడియా దగ్గర్నుంచి.. వెబ్, ఎలక్ట్రానికి మీడియా వరకు ఊదరగొట్టేశారు. ఇంతకీ ‘బాహుబలి’ని కాదని ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరిలో ఆస్కార్ అవార్డుకు భారత్ తరఫున నామినేట్ అయిన ఈ ‘కోర్ట్’ సినిమా సంగతేంటో చూద్దాం పదండి.

కోర్ట్ అనేది ఓ మరాఠి సినిమా. చైతన్య తమ్హానే అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. దాదాపుగా అందరూ కొత్త వాళ్లే నటించారు. మన న్యాయవ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. తన రచనలు, పాటలతో ఓ మున్సిపల్ కార్మికుడిని ఆత్మహత్యకు పురిగొల్పుతాడో కవి. అతణ్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే.. అతను భారత న్యాయ వ్యవస్థకు ఎలాంటి ప్రశ్నలు సంధించాడన్న నేపథ్యంలో కథ సాగుతుంది. కింది కోర్టులో తప్పన్నది పైకోర్టులో ఎలా ఒప్పవుతుంది.. మన కోర్టులో విచారణ ఎంత నత్తనడకన సాగుతుంది.. కోర్టుల్లో ఎన్ని అన్యాయాలు జరుగుతాయనే కోణంలో సెటైరికల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు చైతన్య.

ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. బోలెడన్ని అవార్డులు కొల్లగొట్టింది. దాదాపు 20 దాకా అవార్డులు ‘కోర్ట్’ సొంతమయ్యాయి. గత ఏడాదికి జాతీయ ఉత్తమ చిత్రం కూడా అదే. గత ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలైంది కూడా. కానీ జనాలకు అప్పుడు పట్టలేదు. కానీ ఇప్పుడు ఆస్కార్ కు ఎంట్రీగా పంపేసరికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.