Begin typing your search above and press return to search.

అరెస్ట్ అని తెలిసీ ఫిల్మీ ఈవెంట్లో చిలౌట్‌

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:53 AM GMT
అరెస్ట్ అని తెలిసీ ఫిల్మీ ఈవెంట్లో చిలౌట్‌
X
ఓ కోర్టు కేసులో అరెస్ట్ ఉంటుంద‌ని ముందే తెలిసీ ఆయ‌న ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ఫిల్మీ ఈవెంట్లో సంద‌డి చేశారు. ఓవైపు వారెంట్ జారీ అయ్యింద‌ని తెలిసినా ఆ టెన్ష‌న్ ఏదీ పైకి క‌నిపించ‌కుండా ప్ర‌శాంతంగా గడిపారు. త‌న‌యుడు న‌టించిన సినిమా రిలీజ్ కి వ‌స్తుంద‌న్న ఆనందం ఓ వైపు.. అరెస్టు కోసం పోలీస్ మూక‌లు రెడీ అవుతున్నార‌న్న ఎమోష‌న్ ఇంకోవైపు. అయినా ఆయ‌న ఆ రెండిటినీ ఎంతో బ్యాలెన్స్ డ్ గా కూల్ గా మ్యానేజ్ చేశారు. ఇంత‌కీ ఆయ‌నెవ‌రు? అంటే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు.

ఇదంతా నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించే. జ‌మానా కాలంలోని `జ‌బ‌ర్ధ‌స్త్` సినిమా కాపీ రైట్స్ వివాదంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఇటీవ‌ల దిల్లీ కోర్టులో తీర్పు వెలువ‌డింది. ఆ సినిమా `బ్యాండ్ బాజా బ‌రాత్` కి కాపీ సినిమానే. న‌ష్ట ప‌రిహారం చెల్లించాలంటూ య‌శ్ రాజ్ ఫిలింస్ కి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ కేసు వ్య‌వ‌హార‌మై బెల్లంకొండ చాలా కాలంగా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ టీవీ రైట్స్ కొనుక్కున్న చానెల్ వాళ్లు కూడా అత‌డిపై గుర్రు మీద ఉన్నారు.

ఇంత టెన్ష‌న్ లోనూ కుమారుడు సాయి శ్రీ‌నివాస్ భ‌విష్య‌త్ ని తీర్చి దిద్దేందుకు ఒక తండ్రిగా నిర్మాత‌గా ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌లేదు. టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని సైతం ఆయ‌న హ్యాండిల్ చేసే విధానం బిగ్ స‌ర్ ప్రైజ్ అన్న ముచ్చ‌టా సాగుతోంది. మిన్ను విరిగి మీద ప‌డినా ఈయ‌నింతే! ఆర్థిక లావాదేవీల్లో వివాదాలతో పోలీసులు.. కోర్టు గొడ‌వ‌లు అంటూ ఇవేవీ కొత్తేమీ కాదు ఆయ‌న‌కు అన్న టాక్ మీడియాలో వినిపిస్తోంది. దిల్లీ కోర్టు తీర్పు త‌ర్వాత కూడా ఆయ‌న ఇంకా నింపాదిగానే ఉన్నారట‌. దీంతో జ‌బ‌ర్థ‌స్త్ సినిమా రైట్స్ కొనుక్కున్న‌ టీవీ చానెల్ గ‌డ‌బిడ స్టార్ట్ చేసింది. స‌ద‌రు చానెల్ ఫిర్యాదు మేర‌కు బెల్లంకొండ సురేష్ ను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. 2010లోనే ఛానల్ వాళ్లు చెల్లించిన‌ రూ.3.5 కోట్లు ఇప్పుడు రూ.11.75 కోట్లకు చేరుకోవ‌డంతో ఆయ‌న నుంచి అంత పెద్ద మొత్తం తిరిగి రాబ‌ట్టాల‌న్న ప్ర‌య‌త్నం సాగుతోంద‌ట‌.