Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : దాసరి నివాసానికి కోర్టు నోటీసులు
By: Tupaki Desk | 3 Nov 2021 8:30 AM GMTటాలీవుడ్ దర్శక దిగ్గజం.. స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు మరణం తర్వాత ఆయన ఇంటిలో కుటుంబ గొడవలు బహిర్గతమయ్యాయి. ఆయన ఇద్దరు కొడుకులు ఆస్తుల కోసం గొడవ పడి అభాసుపాలయ్యారు. ఇప్పటికీ ఇతరులతో గొడవలు మొదలయ్యాయి.
స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని.. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండడంతో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే బాధితుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్పై బుధవారం విచారించిన సిటీ సివిల్ కోర్టు దాసరి కుమారులకు నోటీసులు జారీ చేసింది. దాసరి ప్రభు, దాసరి అరుణ్ లకు నోటీసులు ఇచ్చింది. వారు తీసుకున్న డబ్బులను సోమశేఖర్ రావుకు తిరిగి చెల్లించడానికి నవంబర్ 15 వరకు కోర్టు గడువు విధించింది.
కాగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు తనను చంపుతామని దాసరి కుమారులు బెదిరిస్తున్నారని గతంలో పిటీషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.