Begin typing your search above and press return to search.

'కాలా' స్టార్ కు కోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   9 Jun 2017 10:53 AM GMT
కాలా స్టార్ కు కోర్టు నోటీసులు
X
సినిమాల్లో హీరోలకు ఒకదాని తర్వాత ఒకటి చిక్కుముళ్లు ఎదురైతే దానిని ఎలా సాల్వ్ చేసుకుంటాడా అన్నది తెగ ఇంట్రస్టింగ్ గా చూపిస్తుంటారు. కానీ అదే నిజ జీవితంలో ఎదురైతే ఇబ్బందిగానే ఉంటుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. శంకర్ తో 2.0 షూటింగ్ పూర్తికాకముందే కాలా అనే కొత్త సినిమాకు తలైవా శ్రీకారం చుట్టాడు. రజనీ లాస్ట్ ఫిలిం డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలోనేే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రజనీకాంత్ కు రెండోసారి కోర్టు నోటీసులొచ్చాయి.

1980లలో ముంబయి మాఫియా బ్యాక్ గ్రౌండ్ తో కాలా సినిమా తీస్తున్నారు. ఒకనాటి డాన్ హాజీ మస్తాన్ జీవితగాథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై హాజీమస్తాన్ దత్తపుత్రుడుగా చెప్పుకొంటున్న సుందర్ షకీర్ ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రజనీకాంత్ కు నోటీసు పంపించాడు. ఇది కల్పితగాథ అంటూ దానికి సమాధానం ఇచ్చి తర్వాత ఈ సినిమా టైటిల్ కాలా కరికాలన్ అని ప్రకటించారు. తాజాగా చెన్నైకు చెందిన ప్రొడ్యూసర్ కె.రాజశేఖరన్ కాలా కరికాలన్ టైటిల్, కథ తనదని... వెంటనే రజనీకాంత్ సినిమా షూటింగ్ నిలిపివేయించాలని కోర్టులో పిటీషన్ వేశాడు. ఈ సినిమా టైటిల్ ను సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ లో రిజిస్టర్ కూడా చేయించానని చెప్పుకొచ్చాడు. సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ పలుకుబడి గల వ్యక్తుల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నది రాజశేఖరన్ ఆరోపణ.

ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రజనీకాంత్ - ఫిలిం మేకర్స్ - సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ కు నోటీసులు పంపింది. ఇప్పటికే ముంబయిలో కాలా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో రజనీ సరసన హీరోయిన్ గా హ్యూమా ఖురేషీ నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తుండటం విశేషం. ఈ వివాదం నుంచి సూపర్ స్టార్ ఎలా బయటపడతాడో వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/