Begin typing your search above and press return to search.
మహేష్-వంశీ సినిమాకు ఆ నిర్మాతనే అడ్డు..
By: Tupaki Desk | 25 May 2018 9:49 AM GMT'భరత్ అనే నేను’ సినిమా గ్రాండ్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు ఖుషీ ఖుషీగా ఉన్నాడు. ఈ మధ్యే ఫారెన్ టూర్ వెళ్లి ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు.. అనంతరం జూన్ నుంచి తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
వంశీ పైడిపల్లి రెండేళ్ల క్రితం మహేష్ బాబుకు ఓ కథ చెప్పారు. ఆ కథ బాగా నచ్చడంతో మహేష్ ఒప్పుకున్నాడు. కానీ అంతకుముందే భరత్ అనే నేను సినిమాకు ఒప్పుకోవడంతో మహేష్ కొరటాల శివ తో సినిమా తీశాడు. ఇప్పుడా సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. తనకోసం రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి రెడీ అవుతుండగా అనుకోని అవాంతరం ఎదురైంది.
వంశీ పైడిపల్లి గత సినిమా ఊపిరి పీవీపీ బ్యానర్ లో తీశారు.ఆ సయమంలోనే వంశీకి అడ్వాన్స్ ఇచ్చిన పీవీపీ యాజమాన్యం.. మరో సినిమాను కూడా వాళ్ల బ్యానర్ లోనే తీయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇక బ్రహ్మోత్సవం వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాను కూడా పీవీవీ సినిమానే నిర్మించింది. ఆ సినిమాతో నష్టాలు పాలైంది. దీంతో వంశీ-మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ మా బ్యానర్ లోనే తీయాలంటూ.. తమతోనే వంశీ ఒప్పందం చేసుకున్నాడని పీవీపీ బ్యానర్ కోర్టుకెక్కింది. తాజాగా కోర్టు ఈ వివాదం తేలేవరకు మహేష్ సినిమా మొదలు పెట్టవద్దంటూ కోర్టు నోటీసులు ఇచ్చింది.
కాగా తాజాగా మహేష్-వంశీ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు-అశ్వినీదత్ లు రంగంలోకి దిగారు. కోర్టు బయట పీవీపీ సంస్థతో చర్చలు జరుపుతున్నారట.. తమతోపాటు మహేష్ సినిమాకు నిర్మాతలుగా చేర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయట.. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.