Begin typing your search above and press return to search.

సినీ మాఫియాపైనా తుది తీర్పు?!

By:  Tupaki Desk   |   17 Dec 2018 4:48 AM GMT
సినీ మాఫియాపైనా తుది తీర్పు?!
X
ఫ్యాక్ష‌న్ మాఫియా- టాలీవుడ్ లింకుల గురించి ఇదివ‌ర‌కూ మీడియాలో సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో దావూద్‌- చోటా ష‌కీల్ త‌ర‌హా మాఫియా మ‌బ్బు టాలీవుడ్‌ పైనా క‌మ్ముకోవ‌డం అప్ప‌ట్లో సంచ‌లన‌మైంది. మ‌ద్దెల చెర్వు సూరి- భానుల ఫ్యాక్ష‌న్‌ మాఫియాపై అప్ప‌ట్లో టాలీవుడ్‌ లో ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగింది. ఈ లింకులో ఇద్ద‌రు నిర్మాత‌ల పేర్లు వినిపించాయి. ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల నేప‌థ్యంలో ఈ సినీ లింకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీనిపై సీరియ‌స్‌ గా విచారించిన పోలీసులు సినీనిర్మాత‌లు సింగ‌న‌మ‌ల ర‌మేష్‌ - సి.క‌ళ్యాణ్ పైనా అప్పట్లో విచార‌ణ సాగించారు. అయితే ఆ ఇద్ద‌రూ త‌మ‌కు స‌ద‌రు మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవ‌ని వాదించారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత మ‌ద్దెల చెరువు సూరి హ‌త్య కేసుపై కోర్టులో తుది తీర్పు వెలువ‌డేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తెలుస్తోంది. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో పాయింట్ బ్లాంక్‌ లో గ‌న్‌ గురి పెట్టి మ‌ద్దెల చెర్వు సూరిని కాల్చి చంపాడని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ భానుకిర‌ణ్ పై తుది తీర్పు వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది. 32 మంది సాక్ష్యుల విచార‌ణ‌తో 62 పేజీల రిపోర్టును సిద్ధం చేసిన సీఐడీ ఈ విచార‌ణ‌కు ముగింపు ప‌లికేందుకు రెడీ అవుతోంది.

అన్నిటికి తుది తీర్పు ఈ మంగ‌ళ‌వారం.. అంటే సినీ మాఫియాపైనా ఈ తుది తీర్పులో ఏం చెప్ప‌బోతున్నారు? అన్న‌దానిపైనా ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అప్ప‌ట్లో సి.క‌ల్యాణ్ నిర్మించిన‌ కొన్ని టాలీవుడ్ భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు సింగ‌న‌మ‌ల ఫైనాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే మ‌ద్దెల చెరువు సూరి కి బినామీగా ఉన్న భాను వంద‌ల కోట్ల ఆస్తుల‌పై పూర్తి వివ‌రాలు పోలీసులు సేక‌రించార‌ని - దీనిపైనా తీర్పు వెలువ‌డుతుంద‌ని చెబుతున్నారు. అప్ప‌ట్లో ప‌లువురు క‌థానాయిక‌ల‌పై మాఫియా వేధింపుల వ్య‌వ‌హారం వెలుగు చూసిన సంగ‌తి తెలిసిందే.