Begin typing your search above and press return to search.
షూటింగ్స్ కి బిగ్ షాక్ ఇస్తున్న కోవిడ్!
By: Tupaki Desk | 10 Jan 2022 1:30 PM GMTకోవిడ్ షూటింగులకు షాకిస్తోంది. చాలా పెద్ద సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడుతోంది. ఇంతకుముందే ప్రముఖ హాలీవుడ్ స్టార్ నటిస్తున్న సెట్లో 500 మంది పని చేస్తుంటే ఏకంగా 50 మందికి ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చిందన్న వార్త కలకలం రేపింది. ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ బంద్ అయ్యింది.
ఇప్పుడు విదేశాల్లోనే కాదు భారతదేశంలోనూ ఓమిక్రాన్ ప్రభావం అధికంగా ఉంది. రోజుకు లక్షన్నర కేసులు కలవరపెడుతున్నాయి. దీని ప్రభావం సినిమా షూటింగులపైనా పడుతోంది. ఓమిక్రాన్ కేసులు త్వరగా చికిత్స నుంచి కోలుకుంటున్నా.. వేగంగా విస్తరించే స్వభావం వల్ల ఇప్పటికి షూటింగులకు మాత్రం ఇబ్బంది తప్పేట్టు లేదు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్.. బండ్ల గణేష్.. మంచు మనోజ్.. లక్ష్మీ మంచు తదితర స్టార్లు .. కొందరు టెక్నీషియన్లు కూడా కరోనా భారిన పడడంతో వీరంతా షూటింగులకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఎఫ్ 3 షూటింగ్ లో కరోనా కలకలకం
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీల్లో టెన్షన్ నెలకొంది. ఫిలింనగర్ కృష్ణానగర్ లో ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ నుంచి రాగానే పాజిటివ్ అని తేలింది. తాజాగా బండ్ల గణేష్ కి మూడోసారి కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. వరుసగా స్టార్లు కరోనా పాజిటివ్ అని చెబుతుండడంతో హై అలెర్ట్ నెలకొంది. టీమ్ లోని పదిహేను మంది సభ్యులు పాజిటివ్ పరీక్షించడంతో F3 షూటింగ్ ఆగిపోయింది. వెంకటేష్.. వరుణ్ తేజ్ సహా పలువురు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రస్తుతం వీళ్లకు షూటింగు లేదు. కేసులు తగ్గుముఖం పట్టే వరకు మళ్లీ షూటింగ్ లు జరిగే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
చిరంజీవి.. బాలకృష్ణ.. ఎన్టీఆర్.. చరణ్.. బన్ని తదుపరి చిత్రాలకు ప్లాన్ చేస్తున్నా ఓమిక్రాన్ నేపథ్యంలో వెనక్కి తగ్గుతున్నారని సమాచారం. ఈ ఖాళీ సమయంలో ఓమిక్రాన్ లేని విదేశీ విహారయాత్రలకు కొందరు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కార్మికులకు తిరిగి పనుల్లేని పరిస్థితి నెలకొంటోంది. ఈ ముప్పు ఏప్రిల్ నాటికి పూర్తిగా తొలగి పోతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది జాగ్రత్తలతో షూటింగుల్లో పాల్గొంటున్నా బిక్కుబిక్కుమని ఉంటున్నారు.