Begin typing your search above and press return to search.
మహానటి కూడా 'పాజిటివ్' జాబితాలో చేరింది
By: Tupaki Desk | 11 Jan 2022 2:33 PM GMTకరోనా మహమ్మారి మూడవ సారి విజృంభిస్తుంది. ఇండియాలో దాదాపుగా ప్రతి రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. కరోనాతో ఆ భాష.. ఈ భాష నటీ నటులు సాంకేతిక నిపుణులు అని కాకుండా ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో లు హీరోయిన్స్ మరియు సాంకేతిక నిపుణులు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ కు చెందిన మహేష్ బాబు తో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రోజుకు ఇద్దరు ముగ్గురు ప్రముఖులు అయినా తాను కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని గంటల క్రితమే రేణు దేశాయ్ తాను అకీరా కరోనా పాజిటివ్ అంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించింది.
నాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ అని తేలింది. ప్రస్తుతం నేను తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో దయచేసి కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నాకు క్లోజ్ గా ఉన్న వారు.. నాతో కలిసిన వారు దయచేసి టెస్టు చేయించుకుని జాగ్రత్తపడండి. ఇంకా మీరు వ్యాక్సిన్ తీసుకోకుంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కీర్తి సురేష్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా త్వరగానే కోలుకుంటాను అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇటీవల ఒక తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో పాటు కీర్తి సురేష్ అకేషన్ కు కూడా వెళ్లింది. కనుక అక్కడో లేదా ఎక్కడో ఆమెకు కరోనా సోకి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలోని వారికి కోవిడ్ నిర్థారణ అవుతున్న నేపథ్యంలో చాలా మందికి వస్తున్నది ఒమిక్రాన్ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదు అవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తుంటే ముందు ముందు మరిన్ని కేసులను చూడబోతున్నామనే ప్రకటనలు వస్తున్నాయి. ఇంకెంత మంది సినీ సెలబ్రెటీలు కరోనా బారిన పడతారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంత ఆందోళనలో కూడా ఒక మంచి విషయం ఏంటీ అంటే ఈసారి ఎక్కువ శాతం కోవిడ్ కేసుల్లో రికవరీ ఉంటుంది. రిస్క్ చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తక్కువ అయినా జాగ్రత్త మాత్రం తప్పనిసరి. కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి.