Begin typing your search above and press return to search.
స్పెషల్ స్టోరీ : కరోనా కాటు.. మార్చింది ఫేటు
By: Tupaki Desk | 11 May 2022 10:30 AM GMTకొన్ని సందర్భాల్లో ఉపద్రవాలు చాలా మంది ఫేట్ ని మార్చేస్తుంటాయి. కొంత మంది జీవితాల్ని కొత్త మలుపు తిప్పుతుంటాయి. మరి కొందరికి అందిన అవకాశాల్ని చేజారుస్తూ షాకిస్తుంటాయి. కరోనా మహమ్మారి కూడా ఇండస్ట్రీలో కొంత మంది జాతకాల్ని మార్చేసింది. అందిన భారీ అవకాశాల్ని చేజార్చింది. కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీని తీవ్ర ప్రకంపణలకు గురిచేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎంతో మంది జీవితాల్లో కల్లోలం సృష్టించింది. ఇక పరిస్థితి ఇంతేనే అనే స్థాయికి తీసుకెళ్లి చుక్కలు చూపించింది.
ఫ్రీగా షూటింగ్ లు చేసుకున్న చోటే సవాలక్ష రిస్ట్రిక్షన్ ల మధ్య పని చేసేలా ఆంక్షలు విధించింది. అయితే ఎట్టకేలకు పరిస్థితులు మారడంతో ప్రస్తుతం యధావిదిగా సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా రిలీజ్ కు నోచుకోని చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కొన్ని బ్లాక్ బస్టర్ లుగా నిలిస్తే మరికొన్ని పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలిచి సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. మరి కొన్ని చిత్రాలు ఊహకందని రీతిలో డిజాస్టర్ గా మారి ప్రేక్షకులకు, ఇండస్ట్రీ వర్గాలను భారీ షాక్ కు గురిచేస్తున్నాయి.
ఇదిలా వుంటే కరోనా కారణంగా క్రేజీ ప్రాజెక్ట్ లని పోగొట్టుకున్న వాళ్లు చాలా మందే వున్నారు. కారోనా కాటు వారి ఫేట్ ని ఎలా మార్చింది? . ఇంతకీ కరోనా ముందు సెట్టయిన క్రేజీ కాంబినేషన్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటీ? అవి కోవిడ్ కారణంగా ఎందుకు కార్యరూపం దాల్చలేకపోయాయి. అన్నది ఇస్పడు చూద్దాం. ఇందులో ముందుగా చెప్పకోదగ్గ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ -'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ప్రాజెక్ట్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించాలని ప్లాన్ చేశారు. లైన్ కూడా ఓకే అయిపోయింది. ఫైనల్ అనుకున్నారు.
కోవిడ్ మొదలైంది. దీంతో ఎన్టీఆర్ 'ట్రిపుల్ ఆర్' ప్రాజెక్ట్ లో వుండటం.. ఆ తరువాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రద్దయి ఆ స్థానంలోకి కొరటాల శివ ప్రాజెక్ట్ రావడం, తరువాత స్థానంలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చేరడంతో ఎన్టీఆర్ - విక్రమ్ కె కుమార్ ప్రాజెక్ట్ రద్దయిపోయింది. పైగా వైజయంతీ బ్యానర్ లో ఎన్టీఆర్ కు కంత్రి, శక్తి వంటి ఫ్లాప్ సినిమాలు వుండటంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమా రద్దవడంతో విక్రమ్ కె కుమార్ 'థ్యాంక్యూ' అంటూ నాగచైతన్యతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం 'దూత' పేరుతో నాగచైతన్యతో అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్నారు. 10 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది.
ఎన్టీఆర్ - విక్రమ్ కుమార్ ల ప్రాజెక్ట్ తరువాత ఇదే తరహాలో రద్దయిన మరో ప్రాజెక్ట్ బన్నీ - సురేందర్ రెడ్డి సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో 'రేసుగుర్రం' వంటి బ్లాక్ బస్టర్ వుండటంతో మరో సారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని సురేందర్ రెడ్డి ప్లాన్ చేశాడు. బన్నీని దృష్టిలో పెట్టుకుని కొత్త కథ రాశాడు. అయితే బన్నీ అప్పటికే 'పుష్ప' షూట్ కోసం రెడీ అయిపోవడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం తన చేతిలో వున్న ప్రాజెక్ట్ లు పూర్తయినా ఇప్పడున్న క్రేజ్ కి బన్నీ ఆ ప్రాజెక్ట్ చేయలేడు. దీంతో కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి పక్కన పెట్టేశాడు.
ఇక బన్నీ - శ్రీరామ్ వేణుల 'ఐకాన్' ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో బన్నీతో ఈ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. శ్రీరామ్ వేణు లైన్ నరేషన్ కూడా అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ , టైటిల్ లోగో పోస్టర్ ని కూడా విడుదల చేశారు. కానీ బన్నీ కథలో మార్పులు కోరడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అటకెక్కేసింది. మరో హీరోతో చేయాలని శ్రీరామ్ వేణు ప్రయత్నించినా ఏ హీరో కూడా ఖాలీగా లేకపోవడంతో అది ఇక అసాధ్యమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి బన్నీ కూడా వదిలేశాడు. ఇప్పడుతున్న క్రేజ్ ప్రకారం బన్నీ 'ఐకాన్' చేయడం కష్టమే.
ఇదే తరహాలో సుకుమార్ - మహేష్ ప్రాజెక్ట్ కూడా ఆగలేదు కానీ చేతులు మారింది. సుకుమార్ ముందు 'పుష్ప' ని మహేష్ తో చేయాలని ప్లాన్ చేశారు. కానీ మహేష్ ఊరమాస్ క్యారెక్టర్ నేను చేస్తే జనాలు చూడరని, కావాలంటే కథలో మార్పుల చెప్పారట. కానీ సుకుమార్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అదే కథతో సినిమా చేయాలని ఫిక్సయ్యారట. దాంతో తాను సినిమా చేయలేనని చెప్పడంతో అదే ప్రాజెక్ట్ బన్నీదగ్గరికి వెళ్లింది. ఫైనల్ గా పాన్ ఇండియా సినిమా అయింది. ఇక వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు.
'మహర్షి' తరువాత మళ్లీ మహేష్ తో సినిమా చేయాలని పక్కాగ ప్లాన్ చేసుకున్నాడు వంశీ పూడిపల్లి అయితే తను చెప్పిన కథ మహేష్ కు పెద్దగా నచ్చలేదని, దాంతో ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో వంశీ పైడిపల్లి మరో కథతో తమిళ హీరో విజయ్ తో బై లింగ్వల్ మూవీని చేస్తున్నాడు. ఇలా కరోనా కాటు.. చాలా మంది ఫేట్ ని మార్చి కొత్త దారులు తొక్కించడం విశేషం.