Begin typing your search above and press return to search.

#వ‌కీల్ సాబ్.. భారీ ప్లానింగ్ స‌రే.. కోవిడ్ స‌హ‌క‌రిస్తుందా?

By:  Tupaki Desk   |   29 March 2021 3:43 AM GMT
#వ‌కీల్ సాబ్.. భారీ ప్లానింగ్ స‌రే.. కోవిడ్ స‌హ‌క‌రిస్తుందా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే అభిమానుల్లో సందడి పీక్స్ కి చేరుకుంది. మునుపెన్న‌డూ లేనంత‌గా ఈసారి జ‌న‌సైనికుల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది.

దానికి కార‌ణం వ‌కీల్ సాబ్ బెనిఫిట్ షో టిక్కెట్లు త‌మ చేతికి అందుతుండ‌డ‌మేన‌ట‌. రిలీజ్ ముందు రోజు రాత్రి వేసే మూడు బెనిఫిట్ షోల‌కు ఒక్కో టికెట్ ధ‌ర రూ.1500 ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. విడుదల ముందు రోజు అర్ధరాత్రి 12గం.ల‌ నుండి మూడు బెనిఫిట్ షోలను ప్లాన్ చేయ‌డ‌మే గాక‌.. ఉదయాన్నే బెనిఫిట్ షోలను కూడా ప్లాన్ చేశార‌ట‌. ఉద‌యం షోల‌కు టికెట్ ధర రూ .500 .. ఇత‌ర‌ అన్ని ప్రాంతాలలో ఏకరీతి టికెట్ ధర మొదటి వారం రూ.200 ఫిక్స్ చేశార‌ని తెలిసింది.

మొత్తానికి ఈ లెక్క‌ల‌తోనే ఓపెనింగుల రికార్డుల‌తో పాటు తొలి వీకెండ్ రికార్డులు తొలి వారం రికార్డులు ప‌వ‌న్ ఖాతాలో ప‌డ‌నున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ ఇదంతా స‌వ్యంగా అనుకున్న‌ట్టు సాగితే తొలి వీకెండ్ నాటికే 50శాతం పెట్టుబ‌డులు వెన‌క్కి వ‌స్తాయ‌ని అంచ‌నా. మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో తొలి వారం బాగా ఆడేస్తే మొత్తం సేఫ్ జోన్ కి రావొచ్చ‌న్న‌ది ప్లాన్.

ఈ సినిమా కోసం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏకంగా 50కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. బ‌డ్జెట్ ప‌రిధి పెద్ద‌దే. అందుకే ఆ మొత్తాన్ని రాబ‌ట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు.. స్పెష‌ల్ షోలు అంటూ హంగామా సృష్టించ‌నున్నారు. అయితే వీటికి ప్ర‌భుత్వాలు ఇప్పుడున్న ప‌రిస్థితిలో అనుమ‌తులు ఇస్తాయా? అన్న‌దే సందేహం.

గుడులు బ‌డులు మూసేసి మ‌హ‌మ్మారీ క్రైసిస్ వేళ థియేట‌ర్లు తెరుస్తారా? అంటూ విమ‌ర్శించేవాళ్లున్నారు. అందువ‌ల్ల ఇలాంటివేవీ లేకుండా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ప‌డ‌కుండా ఉంటే థియేట‌ర్ల నుండి భారీ వ‌సూళ్లు సాధ్యం. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు దిల్ రాజు బృందాలకు కోవిడ్ స‌హ‌క‌రించాల్సి ఉంటుంద‌ని అంచ‌నా.