Begin typing your search above and press return to search.
వైరస్ పాజిటివ్! మరో ఇద్దరు టాప్ స్టార్లకు షాక్
By: Tupaki Desk | 14 Jan 2022 12:30 PM GMTవైరస్ మహమ్మారీ 2022ని కూడా విడిచిపెట్టలేదు. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా ఇప్పుడు రూపం మార్చుకుని ఓమిక్రాన్ గా మారింది. సామాన్యులు సెలబ్రిటీలు అనే విభేధం లేకుండా ఎవరినీ ఇది విడిచిపెట్టడం లేదు. అదృష్టవశాత్తూ ఈ వేరియెంట్ సెకండ్ వేవ్ అంత ప్రమాదం కాదు. దీంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇటీవల వరుసగా పలువురు టాలీవుడ్ టాప్ స్టార్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు మరో ఇద్దరు సెలబ్రిటీలకు పాజిటివ్ అని తెలిసింది. టాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ మరోసారి కోవిడ్-19 బారిన పడినట్లు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఈ స్టార్ వైరస్ భారిన పడి కోలుకున్నారు. అతని సన్నిహిత సిబ్బందిలో ఐదుగురికి వైరస్ పాజిటివ్ రాగా చికిత్సతో కోలుకున్నారు. ఇప్పుడు కూడా అతను తేలికపాటి లక్షణాలను కూడా ఎదుర్కొంటున్నాడు. ఇటీవల సెలవుపై వెళ్లి బహిరంగంగా కూడా కనిపించడంతో ఇతరులు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. ప్రస్తుతానికి అతడి నుంచి అధికారికంగా వార్త ధృవీకరించాల్సి ఉంది. బహుశా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు తన ఇటీవలి చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్న ఒక హీరోయిన్ కి ఆమె తల్లికి పాజిటివ్ అని తేలింది. దీంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.
కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన దుబాయ్ హాలిడే నుండి వచ్చిన తర్వాత ఇటీవల పాజిటివ్ అని పరీక్షలో తేలింది. వ్యాక్సినేషన్ తో జాగ్రత్తగా ఉండాలని తాను చికిత్స తీసుకుంటున్నానని మహేష్ అలెర్ట్ చేశారు. మంచు మనోజ్.. లక్ష్మీ ప్రసన్న సహా పలువురికి పాజిటివ్ రాగా చికిత్స తో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఈ వేవ్ లో చాలా ఇన్ ఫెక్షన్ లు తీవ్రమైనవి కావు. ప్రజలు ఇంటిలో ఒంటరిగా ఉన్నందున త్వరగా కోలుకుంటున్నారు. ఇకపోతే భారతదేశంలో కోటి మందికి వైరస్ సోకినట్టే సోకి కనిపించకుండా వెళ్లిపోతుందని పాజిటివ్ కథనం కూడా వేడెక్కిస్తోంది.