Begin typing your search above and press return to search.
సెకండ్ వేవ్ భయాలు ఇంకా వదల్లేదా? అందుకేనా ఈ రిజల్ట్!
By: Tupaki Desk | 23 Aug 2021 7:30 AM GMTకరోనా థర్డ్ వేవ్ భయాల నడుమ సినీపరిశ్రమలు ఇంకా కోలుకోని పరిస్థితి ఉంది. ధైర్యం చేసి థియేట్రికల్ రిలీజ్ లు చేస్తున్నా కానీ ఫలితం తేడాగానే ఉంది. ఇంతకుముందు సల్మాన్ నటించిన రాధే - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ని థియేటర్లు-ఓటీటీలో సైమల్టేనియస్ గా రిలీజ్ చేయగా రిజల్ట్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ భయాలు తగ్గకముందే సల్మాన్ గట్స్ ని చూపించినా ప్రయోగం విఫలమైంది.
ఇంకా భయాలు వదల్లేదు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలు అలానే ఉన్నాయి. ఇంతలోనే బాలీవుడ్ లో కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `బెల్ బాటమ్`.. టాలీవుడ్ లో శ్రీ విష్ణు నటించిన `రాజ రాజ చోర` చిత్రాలు నేరుగా థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల వారాంతపు వసూళ్లు ఊహించిన విధంగా రాలేదు. తొలి రోజే 20 కోట్ల వసూళ్లు సాధించి కిలాడీ సినిమా ఏకంగా మూడు కోట్లకు పడిపోయింది. ఇక వారంతపు వసూళ్లు చూసుకుంటే చెప్పుకోదగ్గ నంబర్ కూడా రాలేదు. `రాజ రాజ చోర` సినిమాకు మంచి టాక్ వచ్చినా.. విమర్శకుల ప్రశంసలు దక్కినా ఓ ప్లాప్ సినిమా తెచ్చిన వసూళ్లను మాత్రమే సాధించింది. ఈ వైఫల్యానికి కారణాలు అనేకం.
థర్డ్ వేవ్ భయం కావొచ్చు.. రిలీజ్ రోజునే సినిమా పైరసీ కావడం కావొచ్చు.. థియేట్రికల్ రిలీజ్ విషయంలో నిర్మాతలు సరైన ప్రచారం కల్పించడంలో వైఫల్యం కావొచ్చు. ఇలా ఎన్ని కారణాలు విశ్లేషించినా కరోనా సెకెండ్ వేవ్ సృష్టించిన భయం ముందు అవన్నీ తక్కువనే చెప్పాలి. సినిమాలు పైరసీ అయినా వందల కోట్లు వసూళ్లు సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. సరైన ప్రచారం కల్పించకపోయినా యావరేజ్ గా ఆడిన సినిమాలు గతంలో కోకొల్లలు. కానీ థర్డ్ వేవ్ అనే భయం ఎలా ఉంటుందో ఊహించగలం. మహమ్మారీని ప్రేక్షకులు ముందే బలంగా తలచుకోవడంతోనే అసలు సమస్య గా మారిందన్నది తేటతెల్లమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎక్కడ చూసినా పదిమంది కూడా కనిపించడం లేదు. దీంతో థియేటర్లు తెరుచుకున్నా వెల వెల బోతున్నాయి. కేవలం కరోనా భయంతో జనాలు థియేటర్లు వైపు చూడలేదన్నది సుస్పష్టం. తొలివేవ్ లాక్ డౌన్ అనంతరం `క్రాక్`..`జాతిరత్నాలు`.. `ఉప్పెన` లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలకు మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు తండోపుతండాలుగా తరలి వెళ్లారు. ఆ కారణంగానే ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటే కరోనా సెకెండ్ వేవ్ భయాన్ని ఎంతగా నాటిందో అర్ధమవుతోంది.
ఏపీలో టిక్కెట్టు ధర అదనపు సమస్య
మరోవైపు ఏపీలో టిక్కెట్టు ధరల పెంపు అనేది ఇప్పటివరకూ అపరిష్కృతంగా ఉన్న సమస్య కావడంతో అక్కడ ఎగ్జిబిషన్ రంగం కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. థియేటర్ లో సినిమాలను ఆడిస్తున్నా కానీ అక్కడ జీవం కనిపించడం లేదన్న రిపోర్ట్ అందుతోంది. ఇకపై సినీపెద్దలు సీఎం జగన్ తో భేటీ అయ్యి ధరల సవరణపై నా పాత ధరల కొనసాగింపుపైనా భరోసా పొందితేనే ఏపీ నుంచి కలెక్షన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం రిలీజైన సినిమాలు సరిగా వసూళ్లు తేలేకపోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఇక ముందు రిలీజ్ లకు రెడీ అవుతున్న వాటిలో సరైన క్రేజీ సినిమా వచ్చాక కానీ తెలుగు రాష్ట్రాల్లో అసలైన హుషారు ఎంతో తేలదు. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీని గట్సీగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఇక్కడ ఊపొస్తుందనే భావిస్తున్నారు. తిరిగి ఉప్పెన- జాతిరత్నాలు ఊపును ఈ సినిమా తేగలిగితే ఇతరులకు భరోసాని ఇచ్చినట్టే అవుతుందేమో!