Begin typing your search above and press return to search.
'బిగ్ బాస్' ఒక బ్రోతల్ షో: సీపీఐ నారాయణ
By: Tupaki Desk | 6 Sep 2022 2:30 AM GMTబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' షో.. తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో వివాదాలు చెలరేగినా.. విమర్శలు వచ్చినా సరే అశేష ప్రేక్షకాదరణతో ఇప్పటి వరకు ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా 'బిగ్ బాస్' తెలుగు 6వ సీజన్ లో అడుగుపెట్టింది.
బిగ్ బాస్ కొత్త సీజన్ నిన్న ఆదివారం 21 మంది కంటెస్టెంట్స్ తో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 24/7 స్ట్రీమింగ్ అవుతోంది. అయితే 'బిగ్ బాస్' అనేది రియాలిటీ షో కాదని.. అదొక బ్రోతల్ షో అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
'బిగ్ బాస్' మొదటి సీజన్ నుంచి ఈ షోను బ్యాన్ చేయాలని సీపీఐ నారాయణ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో వలన ఎవరికి ఉపయోగం లేదని.. అదొక బ్రోతల్ షో అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. 'బిగ్ బాస్ తెలుగు-6' ప్రారంభమైన నేపథ్యంలో తాజాగా మరోసారి నారాయణ ఘాటు విమర్శలు చేశాడు.
''బిగ్ బాస్ 6వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమయ్యింది. మొదటి నుంచి ఈ షో అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది సమాజానికి దుష్ట శత్రువు. దీని వల్ల సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఒకరికి ఒకరు పరిచయం లేని యువతీ యువకులను తీసుకెళ్లి పెద్ద భూతల స్వర్గంలో పడేస్తారు. వారు అక్కాతమ్ముళ్లు కాదు, భార్యాభర్తలు కాదు. అందరినీ ఒక గుహలో పడేసి 100 రోజులు మీరేమైనా చేసుకోండి అని అంటే ఎలాంటి సంకేతం వెళ్తుంది?'' అని నారాయణ ఓ వీడియో ద్వారా ప్రశ్నించారు.
''ఈ షో ద్వారా మన భారతీయ ఫ్యామిలీ కల్చర్ నేర్పిస్తారా? సంస్కృతి నేర్చుకోండి.. ఆచారాలు నేర్చుకోండి అంటే అక్కడా నేర్చుకునేది. మనదేమీ యూరోపియన్ దేశం కాదు. యువ శక్తి బయటకు వదిలితే సమాజం బాగుపడుతుంది. బిగ్ బాస్ పేరుతో నేషనల్ ప్రాపర్టీని వేస్ట్ చేస్తున్నారు. ఇంట్లో పెట్టి 19 - 20 మంది కోతులతో ఆటలు ఆడిస్తున్నారు.. వాటిని లక్షలాదిమంది కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు''
''బయటా లోపల లక్షలాది మంది యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ సమాజానికి పనికి రాకుండా చేస్తున్నారు. ఇదొక సామాజిక రుగ్మత కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని ద్వారా చెడు సంకేతాలు పోతాయే తప్ప మెసేజ్ ఏం ఇస్తారు? లోపల నూరు రోజులు మేం స్వచ్చంగా బాగున్నాం అంటే ఎవడైనా నమ్ముతారా? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నాం అంటే ఎవరు నమ్ముతారు? బ్రోతల్ హౌస్ నుంచి వచ్చే వాళ్ళని చూస్తే ఏం అంటారు? ఈ కొంపను చూస్తే ఏమంటారు?''
''బిగ్ బాస్ షో చెడు సంకేతాలను చూపించే ఒక దరిద్రపు షో తప్ప మరొకటి కాదు. ఇది ఒక అనైతిక షో.. రియాలిటీ షో కాదు.. బ్రోతల్ షో.. బూతు షో. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సర్వ సభ్య సమాజం దాన్ని అసహ్యించుకోవాలి కానీ ఇంతమంది ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రజలను పూల్స్ ని చేసి డబ్బులు సంపాదించడం అన్యాయం''
''నాగార్జున గారు సినిమాలు చేసి బాగానే డబ్బు సంపాదించారు. వారి నాన్నగారు నాగేశ్వరరావు గారికి ఈయనకి మంచి పేరుంది. అలాంటప్పుడు ఈ ముదనష్టపు షో ద్వారా వచ్చే ముదనష్టపు డబ్బులు ఎందుకు? ఈ షోని నిర్వీర్యం చేయండి. ఈ షోని బ్యాన్ చేయాలని నేను కోరుతున్నాను'' అని నారాయణ చెప్పుకొచ్చాడు. 'బిగ్ బాస్' షోపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.