Begin typing your search above and press return to search.
'క్రాక్' రియల్ స్టోరీ!..అంటున్న దర్శకుడు
By: Tupaki Desk | 7 Jan 2021 9:41 AM GMTసంక్రాంతి అంటే మనకు మాత్రమే పండగ కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీకి కూడా పెద్ద పండగ. ఈ ఫెస్టివల్ సీజన్లో థియేటర్లు కళకళలాడుతుంటే.. బాక్సాఫీస్ గలగలలాడుతుంది. అందుకే.. ముందస్తుగానే కర్చీఫ్ వేసేస్తుంటారు పలువురు మేకర్స్. ఈ సారి బరిలో నిలిచిన నాలుగు పందెం కోళ్లలో తొలి బరిలో దిగబోతున్నాడు రవితేజ. సంక్రాంతికి ఐదు రోజుల ముందే.. అంటే, శనివారమే విడుదల కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
2020 ఆరంభంలో భీష్మ చిత్రానికి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత.. టాలీవుడ్లో ఒక పేరున్న సినిమాకు జరిగిన బహిరంగ వేడుక ఇదే. మధ్య మధ్యలో కొన్ని సినిమాలకు వర్చువల్ ఈవెంట్లు చేసినప్పటికీ.. ఆడిటోరియంలో ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈవెంట్ మాత్రం ఇదే. ఈ వేడుకకు హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ట్రైలర్లో అన్నట్లుగా ఈ సినిమా ష్యూర్ షాట్, నో డౌట్ అని అన్నారు. డాన్ శీను మూవీ ద్వారా రవితేజ తనకు సినిమాల్లో లైఫ్ ఇచ్చారని అన్నాడు. ఆ సినిమాతో పాటు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సైతం సూపర్ హిట్టయిందని.. ఇప్పుడు క్రాక్‌తో తమది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు గోపీ. క్రాక్‌కు అద్భుతమైన కథ కుదిరిందని.. ఈ సినిమాలో భాగమైన వాళ్లందరూ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారని చెప్పాడు.
క్రాక్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజ చేసిన పోలీస్ పాత్రతోపాటు సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ పాత్రలు.. ఇంకా మరికొన్ని క్యారెక్టర్లు నిజ జీవితం నుంచి తీసుకున్నట్టు చెప్పారు. ఆ వ్యక్తులందరూ నిజంగానే ఉన్నారని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందని గోపీ చెప్పాడు.