Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ దేవీ వల్ల బాలీవుడ్ లో మన స్టార్లకు క్రేజు?
By: Tupaki Desk | 9 May 2021 1:30 PM GMTరాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో అగ్ర హీరోలందరికీ డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. మహేష్ .. అల్లు అర్జున్.. రామ్ చరణ్ .. పవన్ కల్యాణ్.. చిరంజీవి.. ఇలా అగ్ర హీరోలందరికీ అతడు మ్యూజిక్ అందించాడు.
ఇక బన్ని కోసం అతడు అందించిన స్పెషల్ నంబర్లు బాలీవుడ్ లో కూడా రింగ్ అవుతున్నాయి. ఇంతకుముందు సల్మాన్ భాయ్ కోసం దింకచిక సాంగ్ ని రీమిక్స్ చేసి శహభాష్ అనిపించాడు. హిందీ మ్యూజిక్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది ఆ పాట. తాజాగా సల్మాన్ నటించిన రాధే కోసం డీజే లోని సీటీమార్ గీతాన్ని రీమిక్స్ చేయగా విశేష ఆదరణ దక్కించుకుంటోంది. సల్మాన్ స్వయంగా దేవీశ్రీని ప్రశంసించారు. అలాగే ఈ పాటకు అద్భుత నృత్యాలతో అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పైనా సల్మాన్ ప్రశంసలు కురిపించారు. ఈ సాంగ్ ఇచ్చినందుకు బన్నికి కృతజ్ఞతలు చెబుతూ సల్మాన్ చేసిన ట్వీట్ కూడా యువతరంలో వైరల్ అయ్యింది. ఇది బన్నీకి హిందీ బెల్ట్ లో క్రేజు పెంచే పరిణామం అనే చెప్పాలి.
బన్ని తర్వాత మళ్లీ ఆ అవకాశం మహేష్ కే ఉంది. మహేష్ నటించిన శ్రీమంతుడు నుంచి ఒక పాటను షారూక్ కోసం దేవీశ్రీ రీమిక్స్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. శ్రీమంతుడులో చారుసీల ఎంతటి క్లాసిక్ గా ఉంటుందో తెలిసిందే. ఈ పాటకు మహేష్ క్లాస్సీ స్టెప్స్ .. విజువల్ బ్యాక్ గ్రౌండ్ ఆడియెన్ కి గొప్పగా కనెక్టయ్యాయి. ఈ పాట రీమిక్స్ కి షారూక్ ఖాన్ క్లాసీ లుక్ కూడా యాప్ట్ గా ఉంటుందనడంలో సందేహమేం లేదు. భరత్ అనే నేను నుంచి ఓ వసుమతి పాటను రీమిక్స్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. ఒకవేళ ఇదే జరిగితే మహేష్ కి కూడా దేవీ వల్ల బాలీవుడ్ లో స్ట్రైక్ రేటు పెరిగినట్టే. హిందీ రీమిక్స్ ల వల్ల తెలుగు వెర్షన్ పాటలు ఉత్తరాదిన వైరల్ అవుతాయి. అది మన హీరోలకు కలిసొచ్చే విషయమే. మహేష్ తో పాటు రామ్ చరణ్ రంగస్థలం పాటల్ని హిందీ బెల్ట్ లో రీమిక్స్ చేస్తే అవి అద్భుతంగా కనెక్టయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు.