Begin typing your search above and press return to search.
ప్రిన్స్ కోసం క్రేజీ డీల్
By: Tupaki Desk | 5 March 2019 7:57 AM GMTశివరాత్రికి స్వీట్ షాక్ అన్నట్టు నిన్న సాయంత్రం మహేష్ వేసిన నాలుగు లైన్ల ట్వీట్ నలభై టన్నుల రచ్చ చేసింది. అపుడో ఇపుడో మొదలైపోతుంది అని ఎదురు చూసిన సుకుమార్ సినిమా చేయడం లేదని ప్రకటన చేయడం ఆలస్యం ఫ్యాన్స్ మొదట షాక్ తిన్నా తర్వాత కుదురుకుని ఇప్పుడున్న హీట్ లో అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తో చేయడమే కరెక్టని కామెంట్స్ రూపంలో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా దీన్ని సంయుక్తంగా అనిల్ సుంకర దిల్ రాజులు నిర్మిస్తారు. షూటింగ్ ప్రారంభ తేదీ మిగిలిన టీమ్ వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఒకపక్క దిల్ రాజు సోలోగా మహేష్ తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు అనిల్ సుంకర పేరు తోడవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణాలు ఉన్నాయి.14 రీల్స్ సంస్థ మహేష్ తో తీసిన దూకుడు-1 నేనొక్కడినే-ఆగడులో అనిల్ సుంకర ఓ భాగస్వామి. వాటిలో రెండు డిజాస్టర్లు కావడంతో షేర్ ఎక్కువగా ఉన్న అనిల్ సుంకర భారీ నష్టాలు చవిచూశాడు. వీటి దెబ్బకు భారీ సినిమాల నిర్మాణం మానేసి లో బడ్జెట్ మూవీస్ మీద ఫోకస్ పెట్టాడు.
అప్పటి నుంచే సానుభూతి మీదున్న మహేష్ అనిల్ సుంకరకు భవిష్యత్తులో ఓ సినిమా చేద్దామని మాటిచ్చాడట. కానీ తానున్న పరిస్థితుల్లో సింగల్ కార్డు ప్రొడ్యూసర్ అంటే కష్టం కాబట్టి దిల్ రాజుతో టై అప్ చేసి తన మాట నిలబెట్టుకోబోతున్నాడు . దీనికి గాను మహేష్ కు పారితోషికం రూపంలో ఈ సినిమాకు జరిగే కంప్లీట్ బిజినెస్ లో 50 శాతం షేర్ ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందని ఫిలిం నగర్ టాక్. మహేష్ సినిమా అంటే ఈజీగా వంద కోట్ల వ్యాపారం చేస్తుంది. అంతకు ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదు. అందులో సగం అంటే కళ్ళు చెదిరే మొత్తమే. మొత్తానికి మహర్షి ప్రమోషన్ మొదలుకాకుండానే దాని తర్వాత సినిమా గురించి ఇంత రేంజ్ లో చర్చ జరుగుతోందంటే మహేష్ సినిమానా మజాకా అంటున్నారు అభిమానులు