Begin typing your search above and press return to search.
బాలకృష్ణ డైరెక్టోరియల్ 'ఆదిత్య 999 మ్యాక్స్'పై క్రేజీ డీటైల్స్!
By: Tupaki Desk | 24 Dec 2022 11:23 AM GMTనందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చివరి పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్ ని జోరుగా మొదలు పెట్టేశారు.
2023 సంక్రాంతి బరిలో జనవరి 12న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీ తరువాత బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత నందమూరి బాలకృష్ణ మెగా ఫోన్ పట్టబోతున్నారా? ..గత కొంత కాలంగా పట్టాలెక్కించాలని చూస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ కు ముహూర్త సెట్ చేసశారా? అంటే అవుతననే సమాధానం వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ.. సీనియర్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుల కలయికలో వచ్చిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'. గత కొంత కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ ని చేయాలని నందమూరి బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైమ్ లో సింగీతం శ్రీనివాసరావు తో 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ ని చేయాలని నందమూరి బాలకృష్ణ ప్రయత్నాలు చేశారు. కథ సంతృప్తి కరంగా రాకపోవడంతో దాన్ని పక్కన పెట్టారు.
అయితే తానే కథని పూర్తి చేసుకున్న బాలయ్య ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు డైరెక్షన్ చేస్తానని ప్రకటించడంతో అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి మొదలైంది. 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో ఈ మూవీకి బాలయ్య శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే కథ పక్కాగా ఫైనల్ కావడంతో ఈ మూవీని 2023 ఫిబ్రవరిలో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారట. అంతే కాకుండా ఈ మూవీతో తన తనయుడు మోక్షజ్ఞని పరిచయం చేయబోతున్నాడని, ఇందులో బాలయ్య, మోక్షజ్ఞ రియల్ లైఫ్ క్యారెక్టర్లలో నటించనున్నారని తెలిసింది.
కొన్నేళ్ల క్రితం 'నర్తన శాల'తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాలనుకున్నారు కానీ సౌందర్య మృతితో ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికి మళ్లీ బాలయ్య మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతుండటం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.