Begin typing your search above and press return to search.
సైలెంట్ మోడ్ లో క్రేజీ హీరోయిన్..షాక్ లో ఫ్యాన్స్
By: Tupaki Desk | 29 April 2022 7:31 AM GMTపక్కింటి అమ్మాయిలా కనిపించే నటి. హీరోయిన్ గా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. అద్భుతమైన నటనతోనే కాకుండా మెరుపుతీగలా మెస్మరైజ్ చేసే డాన్స్ తో స్టార్స్ ని సైతం ఔరా అనిపించింది. తన పక్కన డాన్స్ చేస్తే ఎక్కడ తేలిపోతామో అని స్టార్స్ ఫీలయ్యేలా చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మెగాస్టార్ సైతం తనతో కలిసి స్టెప్పులేయాలని, తన సినిమాలో ఓ నటింపజేయాలని ముచ్చలటపడ్డారంటే ఆమె ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎవరో తెలిసిపోయింది కదూ యస్ సాయి పల్లవి.
శేఖర్ కమ్మముల తెరకెక్కించిన 'ఫిదా' చిత్రంతో భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లా రెండు కులాలు రెండు మతాలు అంటూ హల్ చల్ చేసి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. వెండితెరపై ఓ హీరోయిన్ లా కాకుండా మన పక్కింటి అమ్మాయే అనే ఫీలింగ్ ని ప్రతీ ప్రేక్షకుడిలోనూ కలిగించి వాళ్లు హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నట్టుండీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. 2022 మొదలై 4 నెలలు పూర్తయినా ఇంత వరకు తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించకపోవడం గమనార్హం.
2021 లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాయి పల్లవి. నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరీ', నేచురల్ స్టార్ నాని డ్యుయెల్ రోల్ లో నటించిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సొంతం చేసుకుని నటిగా సాయి పల్లవికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇదే ఊపులో సాయి పల్లవి నటించిన మరో చిత్రం 'విరాట పర్వం'. రానా హీరోగా నటించగా వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఉత్తర తెలంగాణ లో 90వ దశకంలో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీని రూపొందించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.
గత ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ విడుదల కావాల్సి వుంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ అలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది అయినా రిలీజ్ అనుకుంటే భారీ చిత్రాలు వుండంతో కుదరలేదు. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఓటీటీ లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంటూ వరుస కథనాలు విపిస్తున్నాయి.
కానీ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇదిలా వుంటే ఉన్నట్టుండీ సాయి పల్లవి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం, 2022 మొదలై నాలుగు నెలలు పూర్తి చేసుకున్నా ఆమె మరో సినిమా అంగీకరించకపోవడంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. సాయి పల్లవి ఎందుకు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది? .. సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వేదాలం' రీమేక్ 'భోళా శంకర్' చిత్రంలో కీర్తి సురేష్ పాత్రలో చిరుకు సోదరిగా నటించమని ఆఫర్ ఇచ్చారు. పాత్ర తనకు నచ్చకపోవడంతో మెగాస్టార్ ఆఫర్ ఇచ్చినా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది. స్క్రిప్ట్, పాత్ర నచ్చితేనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న సాయి పల్లవి ఆ కారణంగానే సినిమాలు అంగీకరించడం లేదని అంటున్నారు.