Begin typing your search above and press return to search.
పవన్ నిర్మాతకు నో చెప్పిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్?
By: Tupaki Desk | 10 Dec 2022 7:57 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' మూవీతో తెలుగులో పరిచయమయ్యాడు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్. ఈ ఏడాది కమల్ హాసన్ నటించిన సెన్సేషనల్ మూవీ 'విక్రమ్'తో దక్షిణాదిలోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఈ మూవీకి అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం దక్షిణాది స్టార్లతో పాటు బాలీవుడ్ హీరోలని సైతం ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ మూవీతో దక్షిణాదిలో అనిరుధ్ హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.
దేశంలోనే రికార్డు స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న సంగీత సంచలనంగా నిలిచాడు. తన చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలున్నాయి. తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న'జైలర్', కమల్ హాసన్ తో శంకర్ రూపొందిస్తున్న 'ఇండియన్ 2', షారుఖ్ ఖాన్ తో అట్లీ కుమార్ చేస్తున్న 'జవాన్', ఎన్టీఆర్ 30, అజిత్ 62 వంటి సినిమాలున్నాయి. ఈ ఐదు క్రేజీ ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా అనిరుధ్ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.
తెలుగులో అనిరుధ్ అంగీకరించిన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 30 తెలుగులో ఇదే తన రెండవ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లతో పాటు మరి కొన్ని సినిమాల కోసం అనిరుధ్ ని చాలా మంది క్రేజీ హీరోలు సంప్రదిస్తున్నారట.
ఇదే క్రమంలో టాలీవుడ్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ కూడా రీసెంట్ గా అనిరుధ్ ని సంప్రదించాడట. అయితే ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నందున అనిరుధ్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాని పాన్ ఇండియా లెవెల్లో 'RRR' ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. జపాన్, ముంబై, హైదరాబాద్ నేపథ్యంలో సాగే అత్యంత పవర్ ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మూవీని ఈ మూవీని సుజీత్ తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీని ప్రకటిస్తూ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని అనుకుంటున్నారట.
ఇదే విషయాన్ని అనిరుధ్ ని సంప్రదించి వివరించారట. అయితే తాను వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా వుండటవం వల్ల మీ ప్రాజెక్ట్ ని చేయలేనని అనిరుధ్ నిర్మాత డీవీవీ దానయ్యకు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలు పెట్టారట. మళ్లీ దేవీనే ఫైనల్ చేస్తారా? .. లేక మరో సంగీత దర్శకుడిని పిక్ చేసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.