Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి త‌మ‌న్ క్రేజీ న్యూస్

By:  Tupaki Desk   |   5 March 2022 11:30 AM GMT
ప‌వ‌న్ ఫ్యాన్స్ కి త‌మ‌న్ క్రేజీ న్యూస్
X
ప‌వ‌ర్ ప్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ద‌గ్గుబాటి తొలి సారి క‌లిసి న‌టించిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `భీమ్లానాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

చాలా రోజుల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాసీవ్ పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించిన చిత్రం కావ‌డంతో అభిమ‌నులు థియేట‌ర్ల వ‌ద్ద జాత‌ర వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్ర క‌థ‌తో పవ‌న్ ఇమేకు త‌గ్గ‌ట్టుగా మార్పులు చేశారు.

రానా పాత్ర‌ని త‌గ్గించి ప‌వ‌న్ పాత్ర‌ని పెంచేశారు. అంతే కాకుండా మ‌ల‌యాళ వెర్ష‌న్ లో ఇద్ద‌రు హీరోలు. కానీ తెలుగు వ‌చ్చే స‌రికి ప‌వ‌న్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో మార్పులు చేశారు. దీంతో ఈ మూవీ ప‌వ‌న్ సినిమాగా మారిపోయింది. అయితే టైటిల్ లో రానా పేరు లేక‌పోయినా పోటా పోటీగా ప‌వ‌న్ పో పోటీప‌డి న‌టించిన తీరు రానా అభిమానుల‌కు ఊర‌ట‌క‌లిగించింది. సినిమాలో ప‌వ‌న్ - రానాల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో ప‌తాక ఘ‌ట్టాల్లో ఇద్ద‌రి మ‌ధ్య సాగే ఫైట్ ఇరువురి అభిమానుల్ని ఆక‌ట్టుకుంది.

దీంతో థియేటర్ల వ‌ద్ద అభిమానుల జాత‌ర మొద‌లైంది. ఇప్ప‌టికే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టిస్తున్న `భీమ్లానాయ‌క్‌` వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త మార్కుని క్రియేట్ చేయ‌బోతోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని హిందీలోనూ మేక‌ర్స్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. శుక్ర‌వారం `భీమ్లానాయ‌క్‌` హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే తెలుగులో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే హిందీలోనూ హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి రెడీ అయిపోతోంది.

బి4యు ఫిలింస్‌, గ్రాండ్ మాస్ట‌ర్ బ్యాన‌ర్స్ పై సునీల్ షా, రాజ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ సంయుక్తంగా హిందీలో విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్ గా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ రిలీజ్ తో అప్పుడే భీమ్లానాయ‌క్ హంగామా హిందీలో మొద‌లైంది. ఇదిలా వుంటే శ‌నివారం త‌మ‌న్ ప‌వ‌న్ అభిమానుల‌కు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఇటీవ‌ల `భీమ్లానాయ‌క్‌` టైటిల్ సాంగ్ డీజే వెర్ష‌న్ ని విడుద‌ల చేసిన త‌మ‌న్ ఈ సారి ర్యాప్ సాంగ్ ని వ‌ద‌ల బోతున్నాడు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించి అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

నుదిటిపై నిలువు బొట్టు పెట్టుకుని ఓ ఫొటోని షేర్ చేసిన త‌మ‌న్ `భీమ్లానాయ‌క్ బ్యాక్ ఆన్ డ్యూటీ` అనే హ్యాష్ ట్యాగ్ తో ర్యాప్ సాంగ్ వ‌చ్చేస్తోంది. బాణాసంచా పేల్చ‌డానికి సిద్ధంగా వుండండి` అంటూ ట్వీట్ చేశాడు. ఫ్యాన్స్ మాత్రం క్లైమాక్స్ ర్యాప్ సాంగ్ ని రిలీజ్ చేయ‌మ‌ని త‌మ‌న్ ని కోరుతుండటం గ‌మ‌నార్హం. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించారు. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.