Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ హీరోయిన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్..!
By: Tupaki Desk | 25 Jun 2021 1:30 PM GMTసినీ ఇండస్ట్రీలో మోడలింగ్ నుండి వచ్చి హీరోయిన్ గా అలరిస్తుంది కుర్రభామ నిధి అగర్వాల్. చిన్న వయసులోనే సినిమాలలో హీరోయిన్ అవ్వాలనే గోల్ తో కష్టపడి మొత్తానికి హీరోయిన్ అయిపోయింది. 2017లో బాలీవుడ్ మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా మారిన నిధి.. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వెంటనే పుట్టిన ప్లేస్ అయినటువంటి తెలుగు ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే అమ్మడికి కావాల్సినంత అందం చందం ఉన్నా ఆవగింజ స్థాయిలో అదృష్టం కూడా ఉంటే బాగుండేదనిక్ అంటోంది. తెలుగు ఇండస్ట్రీలో నిధికి అదృష్టం అనేది ఇంతవరకు కలిసిరాలేదు.
ఇప్పటివరకు నిధి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ప్రారంభంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ప్లాప్స్ అందుకున్న నిధి.. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఇస్మార్ట్ తో నిధికి ఎలాంటి గుర్తింపు రాలేదు. అయితే ఈ ఏడాది తమిళంలో నిధి చేసిన డెబ్యూ మూవీతో పాటు సెకండ్ మూవీ కూడా హిట్ అవ్వడం విశేషం. తమిళ హీరో శింబుతో ఈశ్వరన్, జయం రవితో భూమి సినిమాలు చేసింది. ఆ రెండు హిట్ అవ్వడంతో అమ్మడికి తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్.
ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది. అయితే తాను చేసే సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాక హిట్ అయినా ఫట్ అయినా తనవంతు 100% ఎఫర్ట్స్ పెడతానని చెబుతోంది. నిధి మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం కూడా కంపల్సరీఅని చెప్పుకోస్తుంది. ప్రస్తుతం వయ్యారి చేతిలో రెండు తెలుగు సినిమాలు.. తమిళంలో ఓ సినిమా ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న హీరో మూవీలో నిధినే హీరోయిన్. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తెలుగులో ఈ రెండు తప్ప వేరే సినిమాలు లేవు. కానీ త్వరలోనే అమ్మడు తమిళంలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మాగిల్ తిరుమెని సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలు కూడా ఓకే చేస్తోందని టాక్. ఈ లెక్కన నిధి తమిళంలో బిజీ అయిపోతుంది.