Begin typing your search above and press return to search.

లోకనాయకుడి 'విక్రమ్‌ 2' గురించి మతి పోగొట్టే పుకారు

By:  Tupaki Desk   |   21 Jan 2023 3:30 AM GMT
లోకనాయకుడి విక్రమ్‌ 2 గురించి మతి పోగొట్టే పుకారు
X
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం తర్వాత 'విక్రమ్‌' సినిమాతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. అంతే కాకుండా విక్రమ్‌ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్‌ సినిమాకు సీక్వెల్స్ ఉండబోతున్నాయి అంటూ ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించిన విషయం తెల్సిందే.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించేందుకు సూపర్‌ స్టార్స్ నుండి చిన్న స్టార్స్ వరకు ఆసక్తిగా ఉన్నారు. అందుకే విక్రమ్‌ 2 లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించే అవకాశం ఉందని తమిళ మీడియా సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

విక్రమ్‌ సినిమా చివర్లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి సందడి చేశాడు. విక్రమ్‌ 2 లో రోలెక్స్ గా సూర్య మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు అనేది ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన విషయం. ఇప్పుడు మరో ఆసక్తికర పుకారు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ తమిళ సినీ ప్రేక్షకులకు మతి పోగొడుతుంది.

విక్రమ్‌ 2 సినిమా లో సూర్య మాత్రమే కాకుండా విలన్ గా తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ కూడా కనిపించబోతున్నాడట. చియాన్‌ విక్రమ్‌ అత్యంత పవర్‌ ఫుల్‌ విలన్‌ గా 'విక్రమ్‌ 2' లో కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. జోరుగా సాగుతున్న ఈ ప్రచారం పై ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్కరు స్పందించలేదు.

కమల్‌ హాసన్ ఇండియన్ 2 సినిమా తో బిజీగా ఉండగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇద్దరు కూడా ఇదే ఏడాదిలో విక్రమ్‌ 2 ను మొదలు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు.

కమల్‌ పనైపోయింది అనుకుంటున్న సమయంలో విక్రమ్‌ తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టడంతో మళ్లీ ఆయన సత్తా ఏంటో అందరికి అర్థం అయ్యింది. కనుక విక్రమ్‌ 2 కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అనే నమ్మకంతో చాలా మంది ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.