Begin typing your search above and press return to search.
క్రేజీ అప్డేట్: 'ఆచార్య' కు మహేష్ బాబు మాట సాయం..?
By: Tupaki Desk | 21 April 2022 5:29 AM GMTమెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే సంగతి తెలిసిందే. చిరు అంటే అపారమైన గౌరవం చూపించే మహేష్.. చెర్రీ తో చాలా సన్నిహితంగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఆదరాభిమానాలు చూపించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా తండ్రీకొడుకుల కోసం మహేష్ తనవంతు సపోర్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''ఆచార్య''. వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 29) విడుదల కాబోతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. చెర్రీ - కొరటాల ఇంటర్వ్యూతో ప్రకారం షురూ చేశారు. ఈ నెల 23న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు.
అయితే ఇప్పుడు 'ఆచార్య' సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ చిత్రానికి మహేష్ బాబు మాట సాయం చేయబోతున్నారట. అధికారికంగా చెప్పలేదు కానీ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనే డైరెక్టర్ కొరటాల శివ ప్రతిపాదనకు సూపర్ స్టార్ వెంటనే అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మహేష్ తో వాయిస్ రికార్డింగ్ పూర్తి చేసేయొచ్చని అంటున్నారు.
మహేష్ కు 'శ్రీమంతుడు' 'భరత్ అనే నేను' వంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల మీద మహేష్ కు అభిమానం ఎక్కువనే సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలానే చిరు - చరణ్ లతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మహేష్ వెంటనే ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది.
నిజానికి 'ఆచార్య' సినిమాలో మహేష్ బాబుతో ఓ కీలక పాత్ర చేయించాలని కొరటాల అనుకున్నారు. దీనికి అగ్ర హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే చిరు - చెర్రీ లను ఒకే సినిమాలో చూడాలని ఆశ పడిన సురేఖ కొణిదెల కోరిక మేరకు ఆ రోల్ ను చరణ్ తోనే చేయించాలని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ RRR మూవీ వల్ల మెగా వారసుడి డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోతే.. ఆ క్యారెక్టర్ ను మహేష్ తో చేయించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే సినిమాలో పాత్ర చేయకపోయినా ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పడానికి మహేష్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇది 'ఆచార్య' చిత్రానికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. గతంలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రానికి మహేష్ మాట సాయం చేశారు. ఇక మహేష్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మెగా మూవీకి మహేష్ తన గొంతు ఇవ్వబోతున్నారు. 'ఆచార్య' కోసం సృష్టించిన ధర్మస్థలి ని వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తారని అంటున్నారు. ఏదేమైనా 'సర్కారు వారి పాట' సినిమా కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇదొక సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరోవైపు మెగా అభిమానులు సైతం దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.