Begin typing your search above and press return to search.
శంకర్-చరణ్ సినిమాపై క్రేజీ అప్డేట్..!
By: Tupaki Desk | 19 Oct 2021 12:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే చరణ్ కెరీర్ లో వస్తున్న ఈ 15వ సినిమా నేపథ్యానికి సంబంధించిన సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
#RC15 ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని.. శంకర్ తరహా సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమా అని మొదటి నుంచీ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హీరోయిన్ కియారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ సినిమా కథాంశం ఇదేనంటూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో చరణ్ ఒక ఐఏయస్ ఆఫీసర్ గా కనిపిస్తారని.. అతను రాజకీయాల్లో అడుగుపెట్టి అస్తవ్యస్తమైన పొలిటికల్ సిస్టమ్ ని ఎలా సరిచేస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమని అంటున్నారు.
ఇప్పటికే విడుదలైన Rc15 అనౌన్స్ మెంట్ పోస్టర్ ని బట్టి ఇందులో రామ్ చరణ్ ఫ్రభుత్వోద్యోగిగా కనిపిస్తారని హింట్ ఇచ్చారు. అలానే గతంలో శంకర్ తీసిన ‘ఒకే ఒక్కడు’ సినిమా కూడా అవినీతి మయమైన రాజకీయ వ్యవస్థ మీదే ఉంటుంది. ఇప్పుడు చరణ్ తో చేసే సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే అయినా.. ఇందులో దర్శకుడు చెప్పబోయే పాయింట్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
శంకర్ సినిమా అంటే మంచి మెసేజ్ మాత్రమే కాదు.. విజువల్ వండర్ గానూ ఉండబోతుందని చెప్పవచ్చు. అదులోనూ ఇది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న దర్శకుడు.. రామ్ చరణ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్ల నిర్మాణం జరిగింది. ఓ సాంగ్ తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మైలురాయి 50వ చిత్రం. అందుకే ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్రొడక్షన్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ గా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం సుమారు 170 కోట్ల వరకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.
'శంకర్ - చరణ్' సినిమాలో అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే తమిళ నటుడు ప్రభు కకూడా ఈ టీమ్ తో జాయిన్ అవుతారని టాక్. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు.
ఇప్పటికే 'ఆచార్య' 'ఆర్ ఆర్ ఆర్' సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసుకొన్న రామ్ చరణ్.. ఇకపై శంకర్ సినిమా మీదనే పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇదే క్రమంలో గౌతమ్ తిన్ననూరి - ప్రశాంత్ నీల్ లతో చెర్రీ సినిమాలు చేస్తారు. RRR తో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన మెగా వారసుడు.. ఇకపై అన్నీ అదే స్థాయిలో సినిమాలు చేయడానికి డిసైడ్ అయినట్లు అర్థం అవుతుంది.