Begin typing your search above and press return to search.
పవర్ గ్లాన్స్ : తొడగొట్టిన తెలుగోడీ రాజసం!
By: Tupaki Desk | 2 Sep 2022 5:43 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పవర్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'హరి హర వీరమల్లు'. పవన్ కల్యాణ్ కెరీర్‌లో నటిస్తున్నతొలి పీరియాడిక్ ఫిల్మ్ ఇది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రకరణ దశలో వుంది.
ఈ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. సెస్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని గురువారం విడుదల చేసి హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. శుక్రవారం పవర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్ ని ప్లాన్ చేశారు. పవర్ గ్లాన్స్ పేకరుతో ప్రత్యేకంగా ఓ వీడియోని శుక్రవారం సాయంత్రం 5:45 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా గురువారం ప్రకటించిన టీమ్ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చకుంది.
గురువారం నుంచే పవన్ కల్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలవ్వడంతో పవర్ గ్లాన్స్ ని శుక్రవారం ఉదయం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. 'దిగొచ్చింది భల్లు భల్లున...పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున.. మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు!' అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల చేసిన పవర్ గ్లాన్స్ పవర్ ఫుల్ గా వుంది. మీసం తిప్పి తొడగొట్టిన ఓ తెలుగోడుగా పవన్ కల్యాణ్ మల్లయోధులను మట్టికరిపించిన తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది.
భారీ స్థాయిలో నిర్మించిన సెట్ లో వందలాది జనాల మధ్య పవన్ మల్లయోధులని మట్టికరిపించే సీన్ టెర్రిఫిక్ గా వుంది. ఈ ఒక్క సీన్ చాలు సినిమాని ఎంత గ్రాండీయర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారో స్పష్టం చేస్తోంది.
పవన్ టెర్రిఫిక్ ఎంట్రీ.. తన మేజనరిజమ్స్... కళాదర్శకుడు తోట తరణి వేసిన గ్రాండీయర్ సెట్.. ఆ తరువాత వీడియో ఎండింగ్ లో రాజంగా బ్లాక్ పంచకట్టులో మెడలో రెడ్ కలర్ కండువా ధరించి నడిచి వస్తున్న పవన్ లుక్.. చుట్టూ వున్న వాతావరణం మరింత కనువిందుగా వుంది. జ్ఞానశేఖర్ వీ.ఎస్ ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది.
ఈఅ వీడియోకి కీరవాణి అందించిన బీజిఎమ్ కూడా రోమాంచిక అనుభూతిని కలిగిస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే కథకు అత్యద్భుతమైన విజువల్స్ ని జోడించి అత్యంత ప్రతిష్టాతక్మంగా పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. బందిపోటు దొంగగా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా పద్మశ్రీ తోటతరణి ప్రాజెక్ట్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. మాటలు సాయి మాధవ్ బుర్రా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.