Begin typing your search above and press return to search.

మహేశ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే క్రేజీ అప్డేట్..!

By:  Tupaki Desk   |   31 Jan 2022 11:35 AM IST
మహేశ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే క్రేజీ అప్డేట్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'అతడు' 'ఖలేజా' వంటి క్లాసిక్స్ తర్వాత #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబడింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మహేష్ 28వ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారని సమాచారం.

కాగా, #SSMB28 చిత్రాన్ని యాక్షన్ జోనర్ లో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ భాగం అవుతున్నారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. త్వరలో మిగతా ప్రధాన నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.

మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో దాదాపు పడమూడేళ్ల గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుంది.