Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్ 2' పై ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారా?
By: Tupaki Desk | 4 Jan 2020 9:15 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్-1 ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెరకెక్కుతోన్న కేజీఎప్-2 ని అంతే భారీగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నా రు. దానికి తగట్టు యూనిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఫైనల్ ఔట్ ఫుట్ తర్వాత బిజినెస్ లెక్కలు తేలనున్నాయి. ఆ విషయం పక్కనబెడితే కేజీఎఫ్ తొలి భాగం రైట్స్ వారాహి చలన చిత్రం దక్కించుకుని తెలుగు లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగు స్టేట్స్ వసూళ్లు ఎంత? అంటే ఓ ప్రచారం వేడెక్కిస్తోంది.
చాప్టర్ వన్ రిలీజ్ సమయం లో యశ్ ఒక సాధారణ హీరో. దాని వల్ల కేజీఎఫ్ చాప్టర్ 1 రైట్స్ ని చాలా చిన్న మొత్తానికే కట్ట బెట్టారు. వారాహి చలనచిత్రం బాహుబలి బ్రాండ్ తో కేవలం 4 లక్షలకే రైట్స్ దక్కించుకుందిట. కానీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ పెద్ద విజయం అందుకుని తెలుగు రాష్ట్రాల నుంచి కోట్లాది రూపాయల వసూళ్ల ను సాధించిందన్న ముచ్చటా సాగింది. కేవలం నాలుగు లక్షలకు కొంటే 10 కోట్లు తెచ్చిందనే విషయం తాజాగా హైలైట్ చేస్తుండడం వెలుగు లోకి వచ్చింది. అయితే టాలీవుడ్ లో 10 కోట్లు తెచ్చేంత సీన్ ఉందా? అంటే అది సదరు నిర్మాణ సంస్థ ఇస్తున్న లీకు అనే భావించాల్సి ఉంటుంది.
టాలీవుడ్ లో మార్కెట్ ఉన్న పరభాషా నటులు సూర్య- కార్తీ వంటి హీరోలకే ఇంత పెద్ద మొత్తం దక్కని పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం సూర్య మాత్రమే ఆ మార్క్ ను అందుకోగలిగాడు. కార్తీ ఆ మార్క్ కు దగ్గరగా మాత్రమే ఉన్నాడు. ఇక విజయ్ చిత్రాన్ని మురుగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ తెరకెక్కించనప్పుడే తెలుగులో 10 కోట్ల వసూళ్లను సాధించ లేదు. కమల్ హాసన్- రజనీకాంత్ లాంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలు కొన్ని మాత్రమే ఆ స్థాయి వసూళ్ల ను అందుకున్నాయి. ఇటీవల కాలంలో పేట- కబాలి- లింగ లాంటి సినిమాలు ఆ రేంజ్ వసూళ్లను సాధించని సంగతి తెలిసిందే. అలాంటిది టాలీవుడ్ లో కొత్త నటుడు యశ్ కి ఇక్కడ 10 కోట్లు తెచ్చే సత్తా ఉందా? అంటే ఇదేమైనా సీక్వెల్ కి హైప్ పెంచే ప్రయత్నమేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. కంటెంట్ పరంగా కేజీఎఫ్ తిరుగు లేని సబ్జెక్ట్ . కానీ ఇది మల్టీప్లెక్స్ సినిమా. బిసీ సెంటర్లలో కొత్త ముఖాలను అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. అక్కడ టిక్కెట్లు తెగితేనే వసూళ్ల పరంగా ఏ సినిమా అయినా హిట్టు. అయితే వారాహి పెట్టింది తక్కువే కాబట్టి ఎలా చూసినా పెట్టుబడి సహా కొన్ని కోట్లు లాభం రావొచ్చు..కానీ 10 కోట్లు లాభం ఉంటుందని అయితే కచ్చితంగా చెప్పలేమన్న విశ్లేషణ సాగుతోంది.