Begin typing your search above and press return to search.
డైరెక్టర్ - కమల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్!
By: Tupaki Desk | 9 Dec 2022 4:38 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ మళ్లీ సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. 'విక్రమ్' సక్సెస్ తో కమల్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలా కాలం తర్వాత కమల్ ఖాతాలో సరైన కమర్శియల్ చిత్రంగా నిలిచింది. దీంతో కొత్త ప్రాజెక్ట్ ల విషయంలోనూ కమల్ జోరుగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు పలు చిత్రాలకు కమిట్అయినట్లు సమాచారం. వాటిలో ఒకటి మహేష్ నారాయణ్ తో చేయాల్సి ఉంది. 'తేరవ్ మగన్' కి సీక్వెల్ గా ఓ చిత్రం తెరకెక్కించానలుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. నారాయణ్-కమల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఇద్దరి అండర స్టాడింగ్ మీద చిత్రాన్ని ముందే నిలిపివేసినట్లు వినిపిస్తుంది.
వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈనెలఖరు ప్రారంభిచాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఈ రకమైన సందర్భం చోటు చేసుకోవడంతో ప్రాజెక్ట్ ఆపేసినట్లు తెలుస్తోంది. మహేష్ నారాయణ గతంలో కమల్ హాసన్ నటించిన విశ్వరూపం ..విశ్వరూపం-2 సినిమాలకు ఎడిటర్ గా పనిచేసారు. ఆ పనితనం నచ్చడంతోనే ఇద్దరు 'తేవర్ మగన్' కి సీక్వెల్ చేయాలనుకున్నారు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. సినిమా ముందుగానే రద్దుచేయడంతో నిర్మాత సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అదే సెట్స్ కి వెళ్లిన తర్వాత ఈ రకమైన సమస్యలు ఎదురైతే పరిస్థితి వేరుగా ఉంటుంది. కమల్ -దర్శక-రచయితల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది చాలా సాధారణంగా చోటు చేసుకుం టుంది. కమల్ ఇమేజ్ కి తగ్గట్టు..అవసరమైన మార్పులు కోరుతుంటారు.
వాటికి మేకర్స్ అగీకరిస్తే పర్వాలేదు. లేదంటే సినిమా నుంచి వైదొలగాల్సిందే. ఇప్పటివరకూ ఇలాంటి సందర్భాలు చాలాసార్లు చోటు చేసుకున్నాయి. కమల్ క్రియేటివిటీలో లోతైన విశ్లేషణ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆస్థాయి విళ్లేషణ కమర్శియల్ గా వర్కౌట్ అవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి.
దీంతో కమల్ విజన్ ని అందుకోవడం దర్శకులకు కొన్నిసందర్భాల్లో అసాధ్యంగానూ మారుతుంటుంది. కమల్ ని మ్యాచ్ చేసే దర్శకులు కోలీవుడ్..మాలీవుడ్ లో మాత్రమే కొందరున్నారు. వాళ్లతోనే ఆయన సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.