Begin typing your search above and press return to search.
చిత్రం 1.1 తో వస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!
By: Tupaki Desk | 22 Feb 2021 10:36 AM GMTఫస్ట్ సినిమా 'చిత్రం' తోనే టాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేశాడు దర్శకుడు తేజ. వీలైనంత వరకు తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలోనూ కొత్త నటీనటులను సాంకేతిక నిపుణులను పరిచయం చేసి వాళ్ళకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాడు. ఉదయ్ కిరణ్ - నితిన్ - సదా - అనిత - రీమాసేన్ - నవదీప్ - ఆది పినిశెట్టి - ప్రిన్స్ - ఆర్ పి పట్నాయక్ - అనూప్ రూబెన్స్ వంటి ఎంతో మందిని తేజ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ క్రమంలో తేజ తన తదుపరి సినిమాతో 45 మంది కొత్తవాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ తేజ ఇంతకముందు 'రాక్షస రాజు రావణాసురుడు' 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే టైటిల్స్ తో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఇవి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే నేడు ఆయన బర్త్ డేని పురస్కరించుకుని మరో కొత్త సినిమా ప్రకటించారు తేజ. తన కెరీర్లోని మరపురాని చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'చిత్రం' సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కించనున్నారు. 2000లో ఉదయ్ కిరణ్ - రీమా సేన్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తేజ తీసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా "చిత్రం 1.1" అనే టైటిల్ తో సినిమా చేయనున్నాడు.
తేజ సొంత నిర్మాణ సంస్థ 'చిత్రం మూవీస్' మరియు 'ఎస్ స్టూడియోస్' ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ద్వారా 45 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. తేజ - ఆర్పీ కాంబినేషన్ లో అనేక మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 'చిత్రం 1.1' సినిమా షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కాబోతోంది.