Begin typing your search above and press return to search.

ఈ విజయం ఎవరిది అంటారూ?

By:  Tupaki Desk   |   28 Jan 2018 4:18 AM GMT
ఈ విజయం ఎవరిది అంటారూ?
X
మొత్తానికి సంక్రాంతికి టాలీవుడ్ డిజాస్టర్ అయ్యిందనేది చాలా మంది అభిమానులు చర్చించుకుంటున్న అంశం. అయితే పండగ వాతావరణం మొత్తం అయిపోయాక దేశం పండుగ మద్య వచ్చిన రెండు కథానాయికల సినిమాలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. పొంగల్ కి అజ్ఞాతవాసి - జై సింహా - రంగుల రాట్నం సినిమాతో వచ్చిన హీరోలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే అనుష్క - దీపిక పదుకొనె లాంటి హీరోయిన్స్ మాత్రం ఆ తరువాత వచ్చి సక్సెస్ అయ్యారు.

అయితే సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయంలో ఎక్కువగా ఏ క్రెడిట్ ఎవరికీ వెళుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడనే అందరూ అంటారు. సినిమా ఫెయిల్ అయితే స్టార్ హిరోలకు అంతగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఇక లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో అయితే తప్పకుండా హీరోయిన్స్ పై ప్రభావం పడుతుంది. మరి ఇప్పుడు భాగమతి - పద్మావత్ సినిమాలు రెండు మంచి హిట్స్ అయ్యాయి. మరి ఇప్పుడు విజయాలు ఎవరికీ దక్కుతాయి అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

ఒక సినిమా సక్సెస్ అనేది సినిమా మొత్తానికి అవసరమే. ముఖ్యంగా దర్శకుడికి. అతను లేకపోతే అలాంటి సినిమా ఉండదు కాబట్టి మొదటి విజయం అతనికి దక్కుతుతుందని అదే తరహాలో హీరోయిన్స్ కూడా కష్టపడతారు కావున వారికి సమానమైన విజయంలో భాగముందని మరికొందరు అంటున్నారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా ఇద్దరి కాంబినేషన్ వర్కవుట్ అయితేనే సినిమాకు విజయం అందుతుంది. సో దర్శకులకు (అశోక్ - సంజయ్ లీలా బన్సాలి) అలాగే హీరోయిన్స్ కి ఈక్వల్ గా క్రెడిట్ ఇవ్వాలని చెప్పవచ్చు.