Begin typing your search above and press return to search.
సింగరాయ్ ని భయపెడుతున్న క్రికెట్ సెంటిమెంట్
By: Tupaki Desk | 1 Dec 2021 5:15 AM GMTనాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈనెల 24న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. అదృష్టం కొద్ది తెలుగు నుండి ఆ రోజున పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో క్రిస్మస్ హాలీడేస్ ను మరియు ఆ వీకెండ్ ను ఒకే ఒక్కడు అన్నట్లుగా బాక్సాఫీస్ ను ఏళబోతున్నాడు. కనుక ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.. పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమా మరో రేంజ్ లో వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను కూడా ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో శ్యామ్ సింగ రాయ్ కి పోటీగా తాను ఉన్నాను అంటూ '83' తో రన్వీర్ సింగ్ రాబోతున్నాడు. బాలీవుడ్ యంగ్ స్టార్ రన్వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ '83' ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్24వ తారీకున హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ తో 83 పై అంచనాలు భారీగా పెరిగాయి. భారతీయులకు క్రికెట్ అంటే దైవం.. ప్రాణం.. క్రికెట్ నేపథ్యంలో సినిమా అంటే ఖచ్చితంగా చెవులు ముక్కులు అనే తేడా లేకుండా ఏదైనా కోసుకునేందుకు సిద్దం అవుతారు. అందుకే ఈమద్య కాలంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు చాలా వస్తున్నాయి. ఈ సినిమా దేశం మొత్తం గర్వించదగ్గ విజయంకు సంబంధించిన సినిమా.. ఇండియా ఏమాత్రం అంచనాలు లేకుండా 1983 ప్రపంచ కప్ లో అడుగు పెట్టింది. సెమీస్ వరకు వెళ్తే వీళ్లు విజేతలే అన్నట్లుగా అందరు అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా కపిల్ దేవ్ టీమ్ కప్పు కొట్టుకుని వచ్చారు. ఆ కప్పు వల్లే ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ ఈ స్థాయి ఆధరణ కలిగి ఉంది అనడంలో సందేహం లేదు.
అలాంటి క్రికెట్ నేపథ్యంలో సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. నాని శ్యామ్ సింగరాయ్ సినిమా తో పాటు 83 కి కూడా మంచి ఆధరణ ఉంది. దాంతో శ్యామ్ సింగరాయ్ కి గట్టి పోటీ తప్పక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రీడాభిమానులు ముఖ్యంగా క్రికెట్ అభిమానులు చాలా మంది ఉంటారు. కనుక సింగరాయ్ క్రికెట్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి వసూళ్ల విషయంలో ముందుకు సాగుతుందా అనేది చూడాలి. 83 యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా చూడాలని భావిస్తారు. కనుక నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాకు 83 పోటీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.