Begin typing your search above and press return to search.
ఫిలింఛాంబర్ లో లబోదిబోమన్నారు!
By: Tupaki Desk | 24 Dec 2019 1:04 PM GMTషూటింగ్ సగం అయ్యాక.. సడెన్ గా కథానాయికను మార్చాల్సిన సన్నివేశం ఎదురైతే.. చివరి నిమిషంలో చిత్రబృందానికి ఎవరైనా హ్యాండిస్తే సన్నివేశం ఎలా ఉంటుంది?.. ఆ మంట మామూలుగా ఉండదు. సరిగ్గా నాలుగైదేళ్ల క్రితం ఊపిరి చిత్రీకరణ ప్రారంభమయ్యే ముందు అలాంటి ఘటన ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ ని వేడెక్కించింది. నాగార్జున- వంశీ పైడిపల్లి- పీవీపీ కాంబినేషన్ చిత్రం `ఊపిరి`లో నటించేందుకు అంగీకరించిన శ్రుతి హాసన్ సరిగ్గా షూటింగ్ ప్రారంభానికి నాలుగైదు రోజుల ముందు హ్యాండివ్వడంతో నిర్మాత పీవీపీ లబోదిబోమన్నారు. శ్రుతి వ్యవహారంపై చాంబర్- నిర్మాతల మండలిని సంప్రదించారు. కోర్టు కేసులవరకూ వెళ్లాక.. చివరికి పెద్దల మధ్య రాజీ బేరం కుదుర్చుకున్నారు.
ఇక ఇప్పుడు అలాంటి వివాదమే ఒకటి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రారంభించి 30 శాతం షూటింగ్ కూడా అయిపోయాక.. సదరు హీరోయిన్ సెట్స్ కి రావాల్సి ఉంటే సడెన్ గా హ్యాండిచ్చిందట. ఇంతకీ ఇలా హ్యాండిచ్చింది ఎవరు? అంటే.. అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. ఇప్పటికే ఈ అమ్మడిపై `అగ్ని సిరగుగల్` నిర్మాత శివ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
సడెన్ గా బాలీవుడ్ లో ఛాన్సొచ్చింది. అది కూడా రణబీర్ సరసన ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు యూటర్న్ తీసుకుని షూటింగుకు రాకుండా ఏడిపిస్తోందని అతడు వాపోయాడు. తన నిర్ణయం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చాంబర్- నిర్మాతల మండలిని సంప్రదించాడు. నడిగర సంఘంలోనూ ఫిర్యాదు చేశారు. తెలుగు- హిందీ చిత్రపరిశ్రమలకు చెందిన నిర్మాతల మండలిలోనూ.. ఆర్టిస్టుల సంఘాల్లోనూ ఫిర్యాదు చేస్తానని శివ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. షాలినిపై కోర్టు కేసు వేస్తానని క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించడం సంచలనమైంది.