Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: `లైగర్`పై ఆ ప్రభావం ఉంటుందా?
By: Tupaki Desk | 2 Nov 2021 7:04 AM GMTఫిలింమేకర్స్ ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకుంటారు. కొందరు కథల్ని నమ్ముతారు. కొందరు ఇన్సిడెంట్స్ ని నమ్మి కథలు రాస్తారు. మరికొందరు తాము ఏం నమ్మితే అదే సినిమాగా తీస్తారు. ఈ మూడో కోవకే చెందుతారు పూరి జగన్నాథ్. ఆయన తాను నమ్మినదానినే విజువలైజ్ చేసి ఇప్పటికే చాలా సక్సెస్ సాధించారు. కానీ ఇటీవలి కాలంలో పూరి నమ్మకం వమ్మవుతోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంటెంట్ కొన్నేళ్లుగా మూసలోనే ఉందన్నది వాస్తవం. ఒకే జానర్ కథలు రాసి తన కథల్ని తానే ఔట్ డేటెడ్ అయ్యేలా చేసారని చాలాసార్లు విమర్శలు వినిపించాయి. ఎక్కువగా రౌడీ తరహా కథలు.. డ్రగ్స్ మాఫియా కథలు ఎంచుకుని రెక్లెస్ హీరోయిజాన్ని ఆయన తెరపై చూపించారు. ఇదే ఆయన కు డ్రా బ్యాక్ గా మారింది. అందుకే ఆ ముద్రని చెరుపుకోవడానికి `ఇస్మార్ట్ శంకర్` తో మరో ప్రయత్నం చేసారు. ఆ సినిమా హిట్ అయినా కానీ పూరీ కంటే హీరోకి హీరోయిన్లకే పేరొచ్చింది.
ఇక ఇటీవలే తనయుడు ఆకాష్ నటించిన `రొమాంటిక్` కూడా రిలీజ్ అయింది. ఇది డ్రగ్స్ నేపథ్యంతో సాగిన ఓ లవ్ స్టోరీ. ఈ సినిమాకి సర్వం పూరినే. కథ..మాటలు..కథనం అన్ని ఆయనే అందించారు. అనీల్ పాదూరి పేరును దర్శకుడిగా వేసారు కానీ వెనుకుండి ఆ కథని నడిపించింది కూడా పూరినే అని స్టైల్ ఆఫ్ మేకింగ్ చూస్తేనే తెలిసిపోయింది. ఏది ఏమైనా రొమాంటిక్ కూడా మూస కంటెంట్ తో వచ్చిన సినిమా అని మరోసారి రుజువైంది. ఇదే సమయంలో పూరి విజయ్ దేవరకొండతో `లైగర్` కూడా చేస్తున్నారు. మరి ఇది భారతీయ తెరపై చూడనంత కొత్త కథతో తీస్తున్నారా? పూరి తనదైన మార్క్ ని వదిలి కొత్తగా ప్రయత్నం చేస్తున్నారా? అన్నది తేలాలి. అయితే ఈ సినిమాతో హిట్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం పూరిపై ఉంది. ఎందుకంటే పూరిని నమ్మి మాత్రమే విజయ్ ఈ సినిమా చేస్తున్నాడు అన్నది వాస్తవం.
అతనికి పాన్ ఇండియా రేంజులో చక్కని గుర్తింపు ఉంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. ఇలా కొంత ఒత్తిడి అయితే పూరిపై ఉంది. పూరి గత చిత్రాల్లా కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా ఆచితూచి చేస్తున్నట్లే కనిపిస్తోంది. కంగారు లేకుండా పూరి కూల్ గా షూట్ చేస్తున్నారు. హిట్ ఇవ్వాలనే కసి కనిపిస్తోంది. మరి ఈ సినిమాపై `రొమాంటిక్` ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. `లైగర్` పాన్ ఇండియా సినిమా కాబట్టి కరోనా క్రైసిస్ సమయంలో తనకు దొరికిన సమయాన్ని పూరి సద్వినియోగం చేసుకుని స్క్రిప్టుపై రీవర్క్ చేశారని కథనాలొచ్చాయి. అది సినిమాకి కలొసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక పూరి తనదైన సినిమా తీసినా దానికి హిందీ బెల్టులో కనెక్టయ్యేందుకు ఛాన్స్ లేకపోలేదు. తెలుగు వారికి పాత బడిపోయినది హిందీ ఆడియెన్ కి కొత్తగా కనిపించినా ఆశ్చర్యం అవసరం లేదు. బేసిక్ గానే పూరి నరనరాన బ్యాంకాక్..థాయ్ లాండ్.. గోవా లాంటి ఎగ్జోటిక్ లొకేషన్లు ఇమిడి పోయి ఉంటాయి. బీచ్ లోనే కూర్చుని కథను రాసేస్తారు. మరి లైగర్ కి కూడా రొమాంటిక్ తరహాలోనే కథ పరంగా టచ్ అప్ ఏమైనా ఇచ్చారా? అంటే ఆ యాంగిల్ కొంత ఉండొచ్చు. అది కూడా అనన్యతో విజయ్ రొమాన్స్ అంతే ఎనర్జిటిక్ గా ఉంటుందని ఇంతకుముందు రేసింగ్ బైక్ సీన్ లీక్డ్ ఫోటోలు చెప్పకనే చెప్పాయి. ఇక లైగర్ అనేది మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమా. ఈ తరహా సినిమాల్ని పూరి గూస్ బంప్స్ తెచ్చే రేంజులో తెరకెక్కించగలరని గతంలోనూ ప్రూవైంది. పోకిరి- ఇడియట్- బిజినెస్ మేన్ లాంటి ఎగ్జాంపుల్స్ మర్చిపోలేం. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ఏం చేయనున్నారు? అన్నది టీజర్ ట్రైలర్ రాకతో అర్థమవుతుంది. దానికోసం కాస్త ఓపిక పట్టాలేమో! భారతీయ తెరపై చూడనంత కొత్త కథతో తీస్తున్నారా లేదా? అన్నది కూడా ఈ సినిమా జయాపజయాల్ని నిర్ధేశిస్తుందని క్రిటిక్స్ విశ్లేషించాల్సి ఉంటుంది.