Begin typing your search above and press return to search.
లతాజీ అంత్యక్రియల్లో సూపర్ స్టార్ చేసినదానికి విమర్శలు.. ప్రశంసలు
By: Tupaki Desk | 7 Feb 2022 5:38 AM GMTనైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ మరణ వార్త సంగీత ప్రియుల హృదయాలను బద్దలు చేసింది. ఆమె తిరిగి మామూలు స్థితికి వస్తారు.. ఆమె నిండు నూరేళ్లు జీవిస్తారు అంటూ అభిమానులు భావిస్తున్న సమయంలో ఆసుపత్రి వర్గాల వారు మరియు కుటుంబ సభ్యులు ఆమె మృతి వార్తను ఆదివారం ఉదయం ప్రకటించారు.
దాంతో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె మృతి పట్ల దేశ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం అయ్యింది. లతాజీ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. కరోనా కారణంగా కాస్త ఆంక్షలు ఉన్నా కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు.. అభిమానులు ఆమె తుది జర్నీకి హాజరు అయ్యారు. మృతి చెందినట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అంత్య క్రియలను నిర్వహించారు.
లతా మంగేష్కర్ అంత్య క్రియల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన మేనేజర్ తో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆయన లతాజీ కి చివరి వీడ్కోలు చెప్పే సమయంలో చేసిన పనిని కొందరు ప్రశంసిస్తూ ఉంటే.. కొందరు ఆయన్ను అర్థం చేసుకోలేక ఆయన చేసిన పని అర్థం అవ్వక విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షారుఖ్ ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని నవాజ్ చదువుతూ ఉండగా ఆయన పన్కనే ఉన్న మేనేజర్ మాత్రం దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఒక వైపు నవాజ్ చదువుతున్న షారుఖ్ మరో వైపు దేవుడిని ప్రార్థిస్తున్న మహిళ ఫొటో షేర్ చేసి ఇండియా యొక్క గొప్పతనం ఇదే అంటూ షారుఖ్ కు అభినందనలు తెలియజేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇదే సమయంలో ఆయన్ను విమర్శిస్తూ ఉన్నారు.
ఆత్మకు శాంతి చేకూరాలంటూ తన ముస్లీం పద్దతిలో అల్లాను ప్రార్థించిన షారుఖ్ ఖాన్ ప్రార్థన ముగించిన తర్వాత తన మాస్క్ ను తొలగించి లతాజీ పాదాల వద్ద ముస్లీ పద్దతిలో ఊదాడు.. అలా ఊదుతున్న సమయంలో కొందరు ఉమ్మినట్లుగా భావించారు. అదేంటి షారుఖ్ ఇలా చేశాడు అంటూ ఆ సమయంలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరికి అసలు విషయం అర్థం అవ్వగా.. మరి కొందరు మాత్రం అసలు ఏం జరిగింది అంటూ తెలుసుకోకుండా షారుఖ్ ను ఇష్టానుసారంగా విమర్శించడం మొదలు పెట్టారు. మొత్తానికి షారుఖ్ చేసింది గొప్ప పని.. ఆయన్ను ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. ఇక చాలా కాలం తర్వాత షారుఖ్ మీడియా ముందుకు వచ్చాడు. కొడుకు జైల్లో ఉన్న సమయంలో ఒక సారి ఆయన మీడియా కంట పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ ఆయన కనిపించలేదు. మళ్లీ లతాజీ అంత్యక్రియల్లో పాల్గొని ఆమెకు నివాళ్లు అర్పించాడు.