Begin typing your search above and press return to search.

సాహో టీజ‌ర్ పై టాలీవుడ్ క్రిటిక్స్ ఏమ‌న్నారు?

By:  Tupaki Desk   |   13 Jun 2019 7:51 AM GMT
సాహో టీజ‌ర్ పై టాలీవుడ్ క్రిటిక్స్ ఏమ‌న్నారు?
X
దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో `సాహో` చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ వ‌ర్గాల నుంచి లీకులు అందిన సంగ‌తి తెలిసిందే. అయితే అంత ఎందుకు ఖ‌ర్చ‌వుతోంది? అంటూ తెలుగు సినీమీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. సాహో కి ఎందుకింత హైప్‌? అంటూ క్రిటిక్స్ లో ఎవ‌రికి వారు విశ్లేష‌ణ‌లు చేసారు. అయితే అంత బ‌డ్జెట్ ఎందుకు ఖ‌ర్చ‌వుతోందో నేడు రిలీజైన సాహో టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. ఈ టీజ‌ర్ ఇలా అంత‌ర్జాలంలో రిలీజైందో లేదో అలా జెట్ స్పీడ్ తో సునామీలా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 5ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కాయి. యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్ ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మేన‌న‌డంలో సందేహం లేదు. షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ 1 - 2 వీడియోల త‌ర‌హాలోనే టీజ‌ర్ కూడా అంతే వేగంగా దూసుకుపోతోంది.

నేటి ఉద‌యం 11.23 నిమిషాల‌కు హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో తెలుగు సినీమీడియా స‌మక్షంలో టీజ‌ర్ ని ప్ర‌ద‌ర్శించింది చిత్ర‌యూనిట్. అయితే ల్యాబ్ లో క్రిటిక్స్ మ‌ధ్య సాహో టీజ‌ర్ పై ఎలాంటి చ‌ర్చ సాగింది? అంటే ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ యాక్ష‌న్ సినిమా చూడ‌బోతున్నామ‌ని తెలుగు మీడియా ప్ర‌శంస‌లు కురిపించింది. ఇండియ‌న్ సినిమా స్క్రీన్ పై నెవ్వ‌ర్ బిఫోర్ అన‌ద‌గ్గ యాక్ష‌న్ మూవీని తెలుగు వాళ్లు గ‌ర్వించేలా తెర‌కెక్కిస్తున్నార‌న్న పాజిటివ్ టాక్ వినిపించింది. ప్ర‌భాస్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న ప్ర‌శంస‌లు కురిశాయి.

అయితే టీజ‌ర్ లో ఎక్క‌డా ప్ర‌భాస్ ని ఎగ్జాగ‌రేట్ చేసిన‌ట్టు కాకుండా ఎంతో బ్యాలెన్స్ చేయ‌డం పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. డార్లింగ్ ఎంత‌ యాక్ష‌న్ మోడ్ లో క‌నిపించినా వీఎఫ్ ఎక్స్ మాయాజాలం డామినేట్ చేసింద‌ని అయితే విజువ‌ల్స్ మాత్రం హాలీవుడ్ స్టాండార్డ్స్ లో చూపించార‌ని క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక 100 సెక‌న్ల టీజ‌ర్ లో ఆద్యంతం ప్ర‌భాస్ ని యాక్ష‌న్ మోడ్ లోనే చూపించారు. ఇక ఎవ‌రు వీళ్లు? అన్న డైలాగ్ కి `ఫ్యాన్స్` అని ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్ కి ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్ర‌శంస‌లు కురిశాయి. `వీళ్లు ఇంత వైలెంటుగా ఎందుకున్నారు?` అని శ్ర‌ద్ధా అడిగిన ప్ర‌శ్న‌కు `డైహార్డ్ ఫ్యాన్స్!` అంటూ ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్ కి క్లాప్స్ ప‌డ్డాయి. అయితే ఈ టీజ‌ర్ ని కేవ‌లం డైహార్డ్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని మాత్ర‌మే రిలీజ్ చేశారంటూ క్రిటిక్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అంతేకాదు... టీజ‌ర్ లో యాక్ష‌నేనా.. ఎమోష‌న్ ఉండ‌దా? అన్న టాక్ కూడా వినిపించింది. అయితే అన్నీ టీజ‌ర్ లోనే చూపించేస్తే ఎలా.. ట్రైల‌ర్ ఉంది క‌దా? అంటూ మ‌రో ముచ్చ‌టా వేడెక్కించింది. మొత్తానికి డార్లింగ్ ప్ర‌భాస్ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్ గురించి.. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ గురించి అంతా ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు.

ఒక ర‌కంగా బాహుబ‌లి 1 - 2 చిత్రాల టీజ‌ర్లు.. ట్రైల‌ర్ల‌తో పోలిస్తే `సాహో` కి సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ కి పాజిటివ్ టాక్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి- ఆర్కా మీడియా బృందం బాహుబ‌లి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కోసం ఎంత‌గా ప్ర‌య‌త్నించినా అప్ప‌ట్లో తెలుగు సినీమీడియా నుంచి ఏదో ఒక‌ర‌కంగా మిశ్ర‌మ స్పంద‌న‌లే వ్య‌క్త‌మ‌య్యాయి. దాంతో పోలిస్తే సాహో కి ఆ ముప్పు లేక‌పోవ‌డంపైనా ఆస‌క్తిగా మాట్లాడుకున్నారంతా. అయితే ఏ సినిమా అయినా కేవ‌లం యాక్ష‌న్ తోనే స‌క్సెసవ్వ‌డం అన్న‌ది అసాధ్యం. సాహోలో ఎమోష‌న్ కంటెంట్ మెప్పించాల్సి ఉంటుంద‌ని.. అది లేక‌పోతే లాంగ్ డ్రైవ్ ఉండ‌ద‌ని.. ఆశించిన రిజ‌ల్ట్ ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని.. తెలుగు క్రిటిక్స్ విశ్లేషించారు. సాహోలో ఎమోష‌న‌ల్ కంటెంట్ ని ట్రైల‌ర్ లో సుజీత్ రివీల్ చేస్తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఆగ‌స్టు 15న సాహో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ లాంచ్.. ప్రీరిలీజ్ వేడుక ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మీడియాలో సాగుతోంది.