Begin typing your search above and press return to search.
జీరో`పై క్రిటిక్స్ ఏమన్నారు?
By: Tupaki Desk | 21 Dec 2018 9:52 AM GMTఈ శుక్రవారం టాలీవుడ్ లో నాలుగు సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. వీటితో పాటు బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారూక్ నటించిన `జీరో` అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజైంది. గత కొంతకాలంగా `జీరో` సినిమా ప్రమోషన్స్ లో ఖాన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడితో పాటే కథానాయికలు కత్రిన, అనుష్క శర్మ ప్రచారం హోరెత్తించడంతో జనాల్లోకి బాగానే వెళ్లింది. ఇటీవలే హైదరాబాద్ విచ్చేసిన షారూక్ మన టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ప్రస్థావన తెచ్చారు. బన్ని స్వీట్ పర్సన్... ఎక్స్ ట్రీమ్ ట్యాలెంటెడ్ హీరో అని పొగిడేశారు.
అదంతా అటుంచితే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన `జీరో` నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మరుగుజ్జు హీరో.. ఒక ఫిలింస్టార్ ని ప్రేమించడం అటు పై తిరస్కారం ఎదుర్కోవడం అన్న కాన్సెప్టుతోనే ఉత్కంఠ పెంచారు. ఈ నేపథ్యంలో ప్రేమకథతో పాటు, సెరిబ్రల్ పార్శీ అనే అరుదైన రుగ్మతతో వీల్ ఛైర్ కి అంకితమయ్యే సైంటిస్టు (అనుష్క శర్మ) కథా కమామీషు ఏంటి? అన్నది ఉత్కంఠ పెంచింది. ఆ మూడు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా కనిపించి ఆసక్తిని పెంచాయి. అనుష్క శర్మతో మరుగుజ్జు సన్నివేశాలు ట్రైలర్ లో ఆసక్తి రేకెత్తించాయి. అలాగే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్- శ్రీదేవి- అభయ్ డియోల్- ఆలియా భట్- కరిష్మా కపూర్ వంటి స్టార్లు అతిధులుగా తళుక్కుమనడంతో సినిమా పై ఉత్కంఠ పెరిగింది.