Begin typing your search above and press return to search.
ప్రస్తుతానికి వీళ్ళు మాత్రమే పాన్ ఇండియా స్టార్లు..!
By: Tupaki Desk | 9 Feb 2022 2:30 AM GMTఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలుగు సినిమా ఆధిపత్యం కొనసాగుతోంది. 'బాహుబలి' చిత్రంతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భాష అడ్డంకులు తొలగించగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ స్టార్స్ - ఫిలిం మేకర్స్ అందరూ అదే బాటలో నడుస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా.. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో ఇద్దరు మాత్రమే పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ వచ్చింది. దీన్ని నిలబెట్టుకునేలా అదే స్థాయిలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగులో నిరాశ పరిచిన 'సాహో' మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో చాటిచెప్పింది. ఇప్పుడు ఇండియాలో డార్లింగ్ లైనప్ లో ఉన్నన్ని పాన్ ఇండియా చిత్రాలు మరో హీరో చేతిలో లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పటికే 'రాధే శ్యామ్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఓం రౌత్ డైరెక్టన్ లో రామాయణం నేపథ్యంలో చేస్తున్న మైథాలాజీ మూవీ 'ఆది పురుష్' షూటింగ్ పూర్తి చేసుకుంది. నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్ 'ప్రాజెక్ట్ K'.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'సలార్' సినిమాలు సెట్స్ మీదున్నాయి. దీని తర్వాత సందీప్ వంగాతో 'స్పిరిట్' అనే సినిమా చేయనున్నారు.
ఇదే క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ ఓ మూవీ కమిట్ అయ్యారు. అలానే డీవీవీ దానయ్య నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' అనే సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో డార్లింగ్ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలో అత్యధిక పారితోషికం వెనకేసుకుంటున్న అగ్ర హీరోగా నిలిచారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా బన్నీకి నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎవరూ ఊహించని రీతిలో క్రేజ్ ఏర్పడింది. మేకర్స్ చెప్తున్న లెక్కల ప్రకారం 'పుష్ప' పార్ట్-1 ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేయగా.. అందులో హిందీ వెర్షన్ ఒక్కటే వంద కోట్లకు పైగా రాబట్టిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు రెండో భాగం మీద అందరి దృష్టి పడింది.
సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' సినిమా కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. మొదటి భాగానికి మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అలానే భవిష్యత్ లో బన్నీ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఉండనున్నాయి. నేషనల్ వైడ్ క్రేజ్ ని కాపాడుకునేలా కథలను దర్శకులను లైన్ లో పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే స్టార్ హీరో తదుపరి ప్రాజెక్ట్స్ మీద క్లారిటీ రానుంది. ఏదేమైనా ప్రస్తుత బాక్సాఫీస్ లెక్కల్ని తీసుకుంటే ప్రభాస్ - అల్లు అర్జున్ మాత్రమే పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా గుర్తించబడ్డారు.
ఇక దర్శకుల జాబితాలో రాజమౌళి అగ్ర స్థానంలో ఉన్నారని చెప్పాలి. 'బాహుబలి' 1 & 2 చిత్రాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన జక్కన్న.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన్నుంచి రాబోతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఈ మూవీ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే ఏకైక కారణం రాజమౌళి. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మహేష్ బాబుతో జక్కన్న ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ - విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - రవితేజ - మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఈ లిస్టులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుల్లో సుకుమార్ - పూరీ జగన్నాథ్ - సందీప్ వంగా - గౌతమ్ తిన్ననూరి - నాగ్ అశ్విన్ - కొరటాల శివ - క్రిష్ తదితరులు రాజమౌళి మాదిరిగా నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.