Begin typing your search above and press return to search.
'కస్టడీ' బాక్సాఫీస్ టార్గెట్ అన్ని కోట్లా!
By: Tupaki Desk | 10 May 2023 8:00 PM GMTఅక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ విశేషమైన గుర్తింపుతో దూసుకుపోతోన్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. గత ఏడాది 'థ్యాంక్యూ'తో భారీ డిజాస్టర్‌ను చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఇప్పుడు 'కస్టడీ' అనే సినిమాతో రాబోతున్నాడు.
కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో యువ సామ్రాట్ నాగ చైతన్య చేసిన సినిమానే 'కస్టడీ'. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని మే 12వ తేదీన (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక లోకేషన్లలో విడుదల చేయబోతున్నారు.
'కస్టడీ' మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. దీంతో దీనికి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 18.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది.
ఇక, 'కస్టడీ' సినిమాకు సంబంధించిన కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా హక్కులకు రూ. 1.20 కోట్లు బిజినెస్ జరగ్గా.. ఓవర్సీస్ రైట్స్ రూ. 2.40 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 21.80 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. అంటే.. ఈ చిత్రానికి రూ. 22.50 కోట్లు వసూలు అయితేనే క్లీన్ హిట్ స్టేటస్ సొంతం అవుతుంది.
ఇదిలా ఉండగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన 'కస్టడీ' సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.