Begin typing your search above and press return to search.
మా ఎన్నికలు : దేవుడు కలలోకి వచ్చి చెప్పడం వల్లే విత్ డ్రా అయ్యాను
By: Tupaki Desk | 6 Oct 2021 3:30 AM GMTమా ఎన్నికల్లో మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ప్యానల్స్ హోరా హోరీగా పోటీ పోటీగా రాజకీయ ఎన్నికలను తలపించేలా ప్రచారం చేస్తున్నాయి. వీరి మద్యలో సీవీఎల్ నరసింహ రావు కూడా పోటీ చేసి మ్యానిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన మ్యానిఫెస్టో కు గురించి చర్చ జరిగింది. సభ్యుల సంక్షేమం కోసం అంటూ చాలా పథకాలను తీసుకు వస్తాను అన్నాడు. మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ రెండు మూడు గంటల వ్యవధిలోనే మా ఎన్నికల బరి నుండి తప్పుకోవడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది. తాను ఎవరో చెప్పారని విత్ డ్రా చేసుకోలేదు.. ఇది నా నిర్ణయం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికి చెప్తాను అన్నాడు. తాను ఏ ఒక్క ప్యానల్ కు మద్దతు తెలపడం లేదు అంటూ ఆ సందర్బంగా సీవీఎల్ చెప్పుకొచ్చారు.
ఆయన నామినేషన్ విత్ డ్రాకు కారణం ఏంటా అంటూ జుట్టు పీక్కుంటున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు రాముడు కలలోకి వచ్చి మా సంక్షేమం కావాలా అధ్యక్ష పదవి కావాలా అని అడిగాడు. అప్పుడు నేను మా సభ్యుల సంక్షేమం కావాలని కోరుకున్నాను. అయితే నామినేషన్ విత్ డ్రా చేసుకోమంటూ ఆదేశించాడు. అంతే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాను అని చెబుతున్నాడు. ఉదయం మ్యానిఫెస్టో విడుదల చేసిన సీవీఎల్ ఒక్క రోజు గ్యాప్ లేకుండా మద్యాహ్నం వరకు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడం పలు అనుమానాలు తావు ఇస్తున్న సమయంలో ఆయన చెప్పిన కారణం మరింత చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో ఈ విషయమై ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు.
మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాత మద్యాహ్నం పడుకుంటే రాముడు కలలోకి వచ్చాడా సర్ అంటూ కొందరు ప్రశ్నిస్తే.. కొందరు మాత్రం రాముడి మా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సీవీఎల్ నరసింహా రావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆరు కోట్ల నిధులను తాను ఇప్పిస్తాను అని.. హెల్త్ ఇన్సురెన్స్ కోసం మా సభ్యులు చెల్లించకుండానే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన చెప్పాడు. ఇంకా కొంత మందితో మాట్లాడి ఆకలి తో అలమటించే మా సభ్యుల కోసం రెండు గంటల్లో సరకులు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. మా ఎన్నికల నుండి తప్పుకున్న ఆయన ఇంతగా మా కోసం పని చేయడం అభినందనీయం అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.