Begin typing your search above and press return to search.

అన‌సూయ ఫిర్యాదు పై సైబ‌ర్ క్రైమ్ సీరియ‌స్

By:  Tupaki Desk   |   11 Feb 2020 4:57 AM GMT
అన‌సూయ ఫిర్యాదు పై సైబ‌ర్ క్రైమ్ సీరియ‌స్
X
సోష‌ల్ మీడియా-డిజిట‌ల్ యుగంలో నెటిజ‌నుల స్పీడ్ గురించి తెలిసిందే. సెల‌బ్రిటీల‌ పై అడ్డూ ఆపూ లేకుండా ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో వేడెక్కిస్తున్నారు. ఒక్కోసారి ఈ కామెంట్లు హ‌ద్దు దాటి తార‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీస్తున్నాయి. కొన్నిసార్లు అత్యుత్సాహంతో బూతు ప‌ద‌జాలం ఉప‌యోగించేస్తూ తార‌ల్ని తీవ్రంగా హ‌ర్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు బూతు బారిన ప‌డ‌డం అటుపై సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించ‌డం తెలిసిందే.

ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ‌ కు ఈ బాధ‌లు త‌ప్ప‌డం లేదు. సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా యాక్టివ్ గా ఉండే అన‌సూయ‌కు నెటిజ‌నుల నుంచి ఘాటైన ప‌దజాలంతో కామెంట్లు ఎదుర్కోక త‌ప్ప‌డం లేదు. అయితే ఈసారి ఓ నెటిజ‌న్ బూతు ప‌ద‌జాలంతో కించ‌ప‌రిచే విధంగా అన‌సూయ‌ను టార్గెట్ చేశాడు. దీంతో అన‌సూయ హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

దీనిపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టిన పోలీస్ ... ఆ బూతు కామెంట్ల‌ను సోష‌ల్ మీడియా నుంచి తొల‌గించి.. అందుకు కార‌కుడైన నెటిజ‌నుడిని ప‌ట్టుకుంటామ‌ని అన‌సూయ‌ ను శాంతింప‌జేశార‌ట‌. సోష‌ల్ మీడియాల్లో ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేయ‌డం నేరం. సైబ‌ర్ క్రైమ్ చ‌ట్టాల ప్ర‌కారం శిక్షార్హం. ఇది తెలిసీ నెటిజ‌నులు చెల‌రేగిపోతే శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఎందరో ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని క‌ట‌క‌టాల పాలైన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ గాళ్. త‌న‌పై ఇలా కామెంట్లు గుప్పించిన వారిని శిక్షించి తీర‌తామ‌ని పోలీసులు సీరియ‌స్ గా చెబుతున్నారు. ఆ మేర‌కు సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ ప్ర‌సాద్ కేసు బుక్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు. ఇక ఇప్ప‌టికే అన‌సూయ ఉదంతంపై టీవీ చానెళ్ల‌లో డిబేట్లు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.