Begin typing your search above and press return to search.
సోనూసూద్ పేరుతో సైబర్ మోసం
By: Tupaki Desk | 9 March 2021 3:30 AM GMTఈమద్య కాలంలో సోనూసూద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియా ద్వారా ఎవరికి సాయం కావాలన్నా కూడా చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న సోనూసూద్ పేరును ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ కు చెందిన ఒక వ్యక్తి సాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతడి అవసరాన్ని గ్రహించి సోనూసూద్ పేరుతో పంకజ్ సింగ్ అనే వ్యక్తి రూ.60 వేల మోసం చేశాడు. సాయం కావాలంటే డబ్బు చెల్లించాలంటూ అతడు సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఫోన్ ద్వారా మోసానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ కు చెందిన ఒక వ్యక్తికి పంకజ్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను సోనూసూద్ ఫౌండేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు కష్టాల్లో ఉన్నారని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. మీకు సాయం చేసేందుకు సోనూసూద్ ఫౌండేషన్ సిద్దంగా ఉంది. మీరు సాయం పొందాలంటే ముందుగా ఫౌండేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను రూ.60 వేలను చెల్లించాలి. ఆ తర్వాత మీరు కోరుకున్న అమౌంట్ ను ఫౌండేషన్ విడుదల చేస్తుందని నమ్మబలికాడట. దాంతో బాధితుడు ఆ మొత్తంను చెల్లించాడు. ఎన్ని రోజులు అయినా సాయం దక్కక పోవడం.. అవతలి వైపు నెంబర్ పని చేయక పోవడంతో తాను మోసపోయాను అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సాయం చేసేవారు డబ్బులు ఎందుకు అడుగుతారనే చిన్న విషయాన్ని బాధితుడు గుర్తించలేక పోయాడు. అందుకే ఇతరులు డబ్బులు అడిగిన సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటూ పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.