Begin typing your search above and press return to search.
సైకిల్ మీదొచ్చి సంచలనాలు సృష్టించారు
By: Tupaki Desk | 1 Aug 2015 4:17 AM GMTప్రాపర్టీ(వస్తువు)ని బేస్ చేసుకుని తెలుగులో సినిమాలు రావడం చాలా అరుదు. అడపాదడపా కొన్ని సన్నివేశాలను మాత్రం ఈ ప్రాపర్టీ కి ప్రాధాన్యత ఇస్తూ చిత్రీకరణ చేస్తూ వుంటారు. అత్తారింటికి దారేది లో కళ్ళజోడు ఫైట్, విజయ్ నటించిన కత్తి సినిమాలో కాయిన్ ఫైట్ వీటికి మంచి ఉదాహరణలు. అలా తెలుగు సినిమా ప్రాపర్టీలలో అగ్రస్థానం సైకిల్ కే చెందిందని చెప్పాలి. సైకిల్ ని బేస్ చేసుకుని ఎన్నో గుర్తుండిపోయే సీన్ లు, డైలాగులు మనకు దక్కాయి. వాటిలో కొన్నిటిపై ఓ లుక్కేద్దామా..
సైకిల్ అనగానే ముందుగా మన జ్ఞప్తికి వచ్చేది నాగార్జున - రామ్ గోపాల్ వర్మల 'శివ'. ఈ చిత్రంలో జె.డి చక్రవర్తిని మన హీరో సైకిల్ చైన్ తెంపి కొట్టే సీన్ అప్పట్లో సంచలనం. యువతకు అదొక ఫ్యాషన్ గా మారిపోయిందంటే విడ్డూరంకాదు. 'చైన్ తెంపు.. వాడ్ని చంపు' అంటూ దీనికి స్పూఫ్ లు కూడా ఇతర సినిమాలలో వాడుకున్నారు.
రాజమౌళి 'మర్యాద రామన్న' చిత్రంలో కూడా సైకిల్ కి మంచి రోల్ ఇచ్చాడు. హీరోని మోస్తూ బాధపడుతున్న పాత్ర ఈ ద్విచక్రవాహనానికి సృష్టించాడు. దానికి రవితేజ వంటి అగ్రనటుడు వాయస్ ఓవర్ చెప్పడం విశేషం.
తాజాగా శ్రీమంతుడు ప్రోమోలలో దాదాపు లక్షకు పైగా ఖరీదైన ఒక సైకిల్ ని క్లాస్ గా తొక్కుతూ మహేష్ అభిమానులను అలరించడం మనకు తెలిసినదే. ఇదేకాక కంత్రిలో తారక్ ఎంట్రీ, జయం, నిజం సినిమాలలో చేజ్ సీన్లకు సైకిల్ నే వాడడం గమనార్హం. సో శభాస్ సైకిల్ అనక తప్పదుకదా.