Begin typing your search above and press return to search.
ఆ సినిమా తీసి తీరతానన్న సురేష్
By: Tupaki Desk | 18 Feb 2017 10:08 AM GMTఇవాళ మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు వర్ధంతి. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి జ్నాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడి కలల సినిమాను తీసి తీరుతానని ఆయన ప్రకటించారు. తన చిన్న కొడుకు వెంకటేష్.. మనవళ్లు రానా.. నాగచైతన్యల కాంబినేషన్లో మల్టీస్టారర్ తీయాలని ఆశపడ్డారు రామానాయుడు. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు.
రామానాయుడు ఉండగా.. రానా.. నాగచైతన్య కెరీర్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్లు. కాబట్టి మల్టీస్టారర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఐతే ఈ మధ్య ఇద్దరూ బాగానే నిలదొక్కుకున్నారు. వెంకీ కూడా వీళ్లతో కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. మధ్యలో వెంకీ.. రానా కలిసి కొన్ని స్క్రిప్టులు కూడా విన్నారు కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సురేష్ మాట్లాడుతూ.. వెంకీ-రానా-చైతూ కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. తన తండ్రి కలల సినిమాకు కచ్చితంగా వెండితెర రూపం ఇస్తామన్నారు. సరైన సమయంలో ఈ సినిమాను అనౌన్స్ చేస్తామన్నారు. ఈ మల్టీస్టారర్ అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలని.. అందుకే తొందరపడట్లేదని.. సరైన సమయంలో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/