Begin typing your search above and press return to search.
వీడియో : కొండపొలం ఇంట్రెస్టింగ్ దారులు దారులు పులిచారలు
By: Tupaki Desk | 3 Oct 2021 3:41 AM GMTఉప్పెన సినిమాతో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన విషయం తెల్సిందే. కొండపొలం టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా పాటలు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదల అయిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సమయంలో మరో మంచి ఫీల్ గుడ్ పాటను విడుదల చేశారు. దారులు దారులు దారులు.. పులి చారలు చారలు అంటూ సాగే పాటను విడుదల చేయడం జరిగింది. కీరవాణి స్వయంగా పాడిన ఈ పాట సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఎమోషనల్ లిరిక్స్ తో పాటు సినిమా కథ గురించి ఆలోచింపజేసే విధంగా ఉంది.
కీరవాణితో పాటు ఈ పాటను హరిక నారాయన్ పాడటం జరిగింది. ఈ పాటలో వచ్చే విజువల్స్ ఊహించుకుంటూ ఉంటే ఒల్లు గగుర్లు పొడుస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటలో ప్రతి పదం అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండటంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాట కొద్ది సమయం ఉన్నా కూడా మంచి ఫీల్ ను కలుగ జేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాట సందర్బం ఏంటో కాని సినిమాకు ఈ పాట ప్రధాన ఆకర్షణగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అద్బుతమైన క్రిష్ దర్శకత్వ ప్రతిభకు కొండ పొలం నిదర్శణం అని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏంటీ అంటూ అభిమానులు అంటున్నారు. చాలా తక్కువ సమయంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేశాడు.
రెండు నెలల టైమ్ లోనే కొండ పొలం ను ముగించిన క్రిష్ కరోనా కారణంగా విడుదల మాత్రం ఆలస్యం చేశాడు. ఇది ఓటీటీ మూవీ అని అంతా అనుకున్నారు. కాని కొండపొలం సినిమా థియేటర్ల చూస్తేనే బాగుంటుంది.. పులితో ఆట ను వెండి తెరపై చూపించాలనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొండ పొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం తెల్సిందే. వైష్ణవ్ కు జోడీగా అంతటి సీనియర్ హీరోయిన్ ఏంటీ అంటూ అంతా పెదవి విరిచారు. కాని ఆమె లుక్ మరియు ఇద్దరి స్క్రీన్ అప్పియరెన్స్ చూసిన తర్వాత క్రిష్ నిర్ణయం సబబే అనిపించింది. మెగా హీరో వైష్ణవ్ తన ఈ రెండవ సినిమా తో కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.