Begin typing your search above and press return to search.

ద‌బంగ్-3 తొలిరోజు.. ఏదీ జోరు?

By:  Tupaki Desk   |   21 Dec 2019 8:25 AM GMT
ద‌బంగ్-3 తొలిరోజు.. ఏదీ జోరు?
X
కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన ద‌బంగ్ -3 ఈ శుక్ర‌వారం క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ద‌బంగ్ ప్రాంచైజీ నుంచి వ‌చ్చిన మూడ‌వ చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తొలి రెండు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో రెట్టింపు అంచ‌నాల‌తోనే ద‌బంగ్ 3 ప్ర‌చారార్భాటం క‌నిపించింది. కానీ తొలి రోజు ఓపెనింగ్ లు చూస్తే బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించినంత‌ పేల‌లేద‌ని తెలుస్తోంది. హిందీ- తెలుగు- త‌మిళ భాష‌ల్లో భారీగా రిలీజైనా.. ఈ చిత్రం తొలి రోజు కేవ‌లం 25 కోట్లు నెట్ మాత్ర‌మే సాధించింది.

తెలుగు-త‌మిళ్ లో గ‌తంలో భాయ్ సినిమా ఏదీ ఇంత పెద్ద స్థాయిలో రిలీజ్ కాలేదు. దీంతో ద‌క్షిణాది నుంచి భారీగానే వ‌సూళ్లు తెస్తుంద‌ని అంచ‌నా వేసారు. కానీ బాక్సాఫీస్ గణాంకాలను బ‌ట్టి భాయ్ కి ఇక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. హిందీలో కూడా సినిమాపై పెద్ద దెబ్బ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ డే వ‌సూళ్లు ఇంత డ‌ల్ గా ఉన్నాయంటే.. భాయ్ పుంజుకునేదెలా? అన్న‌ది కాస్త సందేహంగానే ఉందిట‌.

శ‌ని- ఆదివారాల‌తో పాటు రెండు మూడు రోజులు క్రిస్మ‌స్ సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి భాయ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సెలవులు క‌లిసొస్తే ప‌ర్వాలేదు. అయినా ఆ మ్యాజిక్ కేవ‌లం హిందీలో మాత్ర‌మే వ‌ర్క‌వుట్ అవుతుంది కానీ... తెలుగులో క‌ష్ట‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. ద‌బంగ్-3కి పోటీగా ప్ర‌తీ రోజు పండ‌గే- రూల‌ర్- వెంకీమామ చిత్రాలు రిలీజ‌య్యాయి. పోటీ గ‌ట్టిగానే ఉంది ఇక్క‌డ‌. అటు కోలీవుడ్ లోనూ క్రిస్మ‌స్ కానుక‌గా లోక‌ల్ గా కొన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ అయ్యియి. అక్క‌డ అభిమానులు స్థానిక సినిమాల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ప‌ర‌భాష‌కు ఇవ్వ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే భాయ్ ప‌ప్పులు ఉడికే ఛాన్స్ లేద‌ని అంచ‌నా వేస్తున్నారు. పైగా టాక్ డివైడ్ గా ఉంది కాబ‌ట్టి ద‌క్షిణాది బాక్సాఫీస్ ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది అన్న‌ది చూడాలి